Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- పురుషుల హాకీ ప్రపంచకప్ 2026..
- టైటిల్‌ను జర్మనీ కైవసం..
- ఫైనల్లో స్పెయిన్‌పై 1-0 గోల్స్ తేడాతో జర్మనీ విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hockey World Cup 2026: పురుషుల హాకీ ప్రపంచకప్ 2026లో జర్మనీ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. బెల్జియంలోని వావ్రేలో ఆదివారం (ఆగస్టు 30) జరిగిన ఫైనల్లో స్పెయిన్‌పై 1-0 గోల్ తేడాతో విజయం సాధించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన జర్మనీ మరోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని సత్తా చాటింది.
హోరాహోరీగా సాగిన తుది పోరులో తొలి రెండు క్వార్టర్లలో ఇరు జట్లూ గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ స్కోరు నమోదు కాలేదు. స్పెయిన్ ఎక్కువసేపు బంతిని తన ఆధీనంలో ఉంచడంతో పాటు పెనాల్టీ కార్నర్లను కూడా సంపాదించింది. అయితే జర్మనీ డిఫెన్స్ అద్భుతంగా అడ్డుకోవడంతో స్పెయిన్‌కు గోల్ చేసే అవకాశం దక్కలేదు. మూడో క్వార్టర్లో జర్మనీకి లభించిన ఏకైక సర్కిల్ ఎంట్రీనే మ్యాచ్ ఫలితాన్ని మార్చింది. 44వ నిమిషంలో మైకేల్ స్ట్రుతాఫ్ బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపడంతో జర్మనీ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత స్పెయిన్ సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ జర్మనీ రక్షణను ఛేదించలేకపోయింది.
పురుషుల హాకీ ప్రపంచకప్ 2026
మ్యాచ్ ముగియడానికి నాలుగు నిమిషాల కంటే తక్కువ సమయం ఉండగా.. స్పెయిన్ గోల్కీపర్ను వెనక్కి తీసుకుని అదనపు అవుట్‌ఫీల్డ్ ఆటగాడిని మైదానంలోకి పంపింది. దీంతో స్పెయిన్ మరింత దూకుడుగా దాడులు చేసినప్పటికీ సమం చేసే గోల్ మాత్రం రాలేదు. చివరి హూటర్ మోగే సమయానికి జర్మనీ 1-0 ఆధిక్యాన్ని కాపాడుకుని ప్రపంచకప్‌ను మళ్లీ ముద్దాడింది. ఈ విజయంతో జర్మనీ పురుషుల హాకీ ప్రపంచకప్‌ను నాలుగోసారి గెలిచిన జట్టుగా నిలిచింది. గతంలో 2002, 2006, 2023లో ప్రపంచకప్ సాధించిన జర్మనీ.. 2026లోనూ టైటిల్ గెలిచి పాకిస్థాన్ రికార్డును సమం చేసింది. పాకిస్థాన్ కూడా 1971, 1978, 1982, 1994లో నాలుగు సార్లు ప్రపంచకప్ గెలిచింది.
Also Read
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
మరోవైపు స్పెయిన్ మూడోసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ మరోసారి నిరాశే ఎదురైంది. 1971, 1998లో ఫైనల్లో ఓడిపోయిన స్పెయిన్.. ఇప్పుడు 2026లోనూ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫైనల్లో లభించిన నాలుగు పెనాల్టీ కార్నర్లను కూడా స్పెయిన్ గోల్స్‌గా మలచుకోలేకపోయింది. టైటిల్ గెలిచిన అనంతరం గోల్ స్కోరర్ మైకేల్ స్ట్రుతాఫ్ మాట్లాడుతూ.. జట్టు విజయం పట్ల ఎంతో గర్వంగా ఉందని చెప్పాడు. యువ ఆటగాళ్లతో కూడిన తమ జట్టు ఒకరి కోసం మరొకరు ఆడారని, ఈ విజయం అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని పేర్కొన్నాడు. మరోవైపు జర్మనీ కెప్టెన్ టామ్ గ్రాంబుష్ తదుపరి లక్ష్యం లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్ అని తెలిపాడు. ప్రపంచకప్‌లో చూపించిన ఇదే స్థాయి ఉత్సాహాన్ని కొనసాగించగలిగితే ఒలింపిక్స్‌లోనూ ఏదైనా సాధ్యమేనని ధీమా వ్యక్తం చేశాడు.
ఇక మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మొత్తంగా ఈ ప్రపంచకప్‌లో 16 జట్ల మధ్య 50 మ్యాచ్‌లు జరిగాయి. టోర్నీలో 248 గోల్స్ నమోదయ్యాయి. ఇందులో 136 ఫీల్డ్ గోల్స్, 97 పెనాల్టీ కార్నర్ గోల్స్, 15 పెనాల్టీ స్ట్రోక్ గోల్స్ ఉన్నాయి.
తాజావార్తలు
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు