Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- తుక్కుగూడలో నర్సు హత్య..
- పోస్టుమార్టం నివేదికలో లైంగిక దాడి నిర్ధారణ..
- ప్రతిఘటించడంతో హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Se*xual Assault: తుక్కుగూడలో నర్సు శిరీష హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఒంటరిగా ఉన్న సమయంలో శిరీషపై లైంగిక దాడికి ప్రయత్నించి, అనంతరం ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి బిహార్‌కు చెందిన కార్ల మెకానిక్ మహ్మద్ సనావుల్లా (34)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఖమ్మం జిల్లా ముల్కలపల్లి మండలానికి చెందిన 21 ఏళ్ల శిరీష సుమారు ఎనిమిది నెలల క్రితం తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా చేరింది. ఆస్పత్రి ఆవరణలో ఉన్న హాస్టల్లో తోటి నర్సులతో కలిసి ఉంటోంది. రాఖీ పండుగ సందర్భంగా రూమ్మేట్స్ స్వగ్రామాలకు వెళ్లడంతో శుక్రవారం రాత్రి శిరీష తన గదిలో ఒంటరిగా నిద్రించింది. శనివారం మధ్యాహ్నం వరకు శిరీష గది నుంచి బయటకు రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చింది. కిటికీలోంచి చూడగా ఆమె విగతజీవిగా కనిపించింది. దీంతో పహాడీషరీఫ్ పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో లభించిన ఆధారాల ఆధారంగా లైంగిక దాడి, హత్య కోణంలో విచారణ చేపట్టారు.
Also Read
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
చివరకు ఆస్పత్రి సమీపంలోని కార్ల మెకానిక్ షాపులో పనిచేస్తున్న సనావుల్లా ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇతర కార్మికులు వెళ్లిపోయిన తర్వాత అతడు అక్కడే నిద్రించేవాడని, కొంతకాలంగా ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సుల కదలికలను గమనించినట్లు దర్యాప్తులో తేలింది. శిరీష ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన సనావుల్లా.. అర్ధరాత్రి హాస్టల్లోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. శిరీష ఉంటున్న గది కిటికీకి గ్రిల్స్ లేకపోవడంతో అదే మార్గం ద్వారా లోపలికి వెళ్లినట్లు తెలుస్తోంది. లైంగిక దాడికి ప్రయత్నించగా శిరీష ప్రతిఘటించి కేకలు వేయడంతో ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది.
నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అయితే ఈ ఘటనలో సనావుల్లా ఒక్కడే ఉన్నాడా? మరెవరైనా సహకరించారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక అందిన తర్వాత కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా నిందితుడు ఆదివారం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో శిరీష మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలో ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం పూర్తైన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
తాజావార్తలు
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
-
Alias Rukmini : నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!