Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hatha: నటుడిగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు నిర్మాతగా కూడా కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. దాదాపు 50 మంది కొత్త నటీనటులతో రూపొందిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’తో నిర్మాతగా అరంగేట్రం చేసిన ఆయన, ఇప్పుడు తన రెండో ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. ఈ సినిమాకు ‘హతః’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈరోజు విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ మాత్రం సినిమాపై ఒక్కసారిగా క్యూరియాసిటీ పెంచేసింది. అసలు ఈ సినిమా కథ ఏంటి? గ్లింప్స్‌లో చూపించిన ఆ పిల్లికి కథతో ఉన్న సంబంధం ఏంటి? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి.
‘హతః’ టైటిల్‌ను ప్రకటించిన విధానం కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. గ్లింప్స్‌లో ముందుగా చీకటిగా ఉన్న ఒక పెట్టె కనిపిస్తుంది. కెమెరా నెమ్మదిగా ఆ పెట్టె వైపు జూమ్ అవుతుండగా, అందులో ఒక పిల్లి ఉన్నట్లు చూపించారు. ఆ తర్వాత ఒక్కసారిగా ‘హతః’ అనే టైటిల్‌ను రివీల్ చేశారు. సాధారణంగా టైటిల్ గ్లింప్స్‌లో సినిమా కథ, హీరో పాత్ర లేదా సినిమాలోని కీలకమైన సన్నివేశాలకు సంబంధించిన కొన్ని విజువల్స్ చూపిస్తుంటారు. కానీ ‘హతః’ టీమ్ మాత్రం అసలు కథకు సంబంధించిన ఎలాంటి క్లూ ఇవ్వకుండా కేవలం ఒక పిల్లి చుట్టూ మిస్టరీని క్రియేట్ చేశారు. త్వరలోనే టీజర్ ఉంటుందంటూ హింట్ కూడా ఇచ్చారు.
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
కిరణ్ అబ్బవరం, పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ‘హతః’ మూవీని నిర్మిస్తున్నారు. అనుష్ గోరక్ ఈ సినిమాకు కథ, దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ బాధ్యతలను చేపట్టారు. జెసిన్ జార్జ్ సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాలో కుష్లు మద్దాల, రెహ్మాన్, నమ్రిత ఎంవి, తనుజ పుట్టస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే సినిమాకు సంబంధించిన స్టోరీన్ మేకర్స్ రహస్యంగానే ఉంచుతున్నారు. కథ ఏమిటి? పాత్రలు ఎలా ఉండబోతున్నాయి? సినిమా ఏ జానర్లో తెరకెక్కుతోంది? అనే విషయాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. గ్లింప్స్ ద్వారా కూడా కథను రివీల్ చేయకుండా కేవలం క్యూరియాసిటీని పెంచే ప్రయత్నం చేశారు. దీంతో ‘హతః’ ఒక థ్రిల్లర్ కథా, సస్పెన్స్ డ్రామానా లేదా మరో కొత్త జానర్లో తెరకెక్కుతున్న సినిమానా అనేది మాత్రం సస్పెన్స్ లో ఉంచారు.
కిరణ్ అబ్బవరం గతంలో నటుడిగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ తో బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందుకున్నాడు. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడం, డిఫరెంట్ కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంపై దృష్టి పెట్టారు. దాదాపు 50 మంది కొత్త నటీనటులతో ‘తిమ్మరాజుపల్లి టీవీ’ని నిర్మించిన ఆయన, ఇప్పుడు ‘హతః’ తో మరో కొత్త తరహా కథను పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ‘హతః’ టైటిల్ గ్లింప్స్‌లో కథను చెప్పకుండా కేవలం ఒక పిల్లి, చీకటి పెట్టె, మిస్టీరియస్ క్యాప్షన్‌తో సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు. అసలు ఆ పిల్లి వెనుక ఉన్న కథ ఏంటి? ఈ మిస్టరీకి హీరో, కథతో ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా నుంచి వచ్చే తదుపరి అప్డేట్స్ కోసం వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!