Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suriya 49: తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు హెచ్. వినోద్ కాంబినేషన్లో ‘సూర్య 49’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ గా కనిపించబోతున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వినోద్ చెప్పిన కథ, పాత్ర నచ్చడంతో నాగార్జున కూడా ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఆఫీషియల్ గా ప్రకటన మాత్రం రాలేదు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘సూర్య 49’లో సూర్యకు ధీటుగా విలన్ పాత్రను దర్శకుడు హెచ్. వినోద్ డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ పాత్ర కోసం నాగార్జునను సంప్రదించారని, ఆయనకు కథ బాగా నచ్చడంతో నటించేందుకు ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. నాగార్జునలాంటి సీనియర్ స్టార్ ఇందులో భాగమైతే సినిమాకు తమిళంతో పాటు తెలుగు మార్కెట్లోనూ మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. అయితే చర్చలు ఇంకా పూర్తిగా ముగియలేదని, అందుకే మేకర్స్ అధికారికంగా నాగార్జున పేరును ప్రకటించలేదని తెలుస్తోంది.
Also Read
- Dulquer Salmaan: "టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా"
- Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
- Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
- Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
నాగార్జున విలన్‌గా నటిస్తారనే వార్తపై అభిమానుల్లో మాత్రం భిన్నమైన స్పందన కనిపిస్తోంది. గతేడాది రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’లో నాగార్జున ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. ఆ సినిమాలో ఆయన లుక్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు మంచి స్పందన వచ్చినప్పటికీ, పాత్రకు తగినంత బలం లేదని కొందరు అక్కినేని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నాగార్జున స్థాయి హీరోకు మరింత పవర్ఫుల్ క్యారెక్టర్ ఉండాల్సిందని సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేశారు. ఇప్పుడు మరోసారి ఆయన విలన్ పాత్రలో కనిపిస్తారనే వార్త రావడంతో, ఈసారి అయినా పవర్ ఫుల్ రోల్ ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ‘డీసీ’ ఫేమ్ వామికా గబ్బిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సూర్య, నాగార్జున, వామికా గబ్బి కాంబినేషన్ నిజమైతే ఈ ప్రాజెక్ట్‌కు టాలీవుడ్, కోలీవుడ్‌లో మంచి హైప్ వచ్చే అవకాశం ఉంది. ‘సూర్య 49’ను సూర్య, జ్యోతికలకు చెందిన జాగరం స్టూడియోస్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కథ, నటీనటుల ఎంపిక, ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.
మరోవైపు నాగార్జున ప్రస్తుతం తన కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా ‘కింగ్ 100’తో బిజీగా ఉన్నారు. ఆర్.ఏ. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టబు, సుష్మిత భట్, ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2026 డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆయన 47వ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ మూవీ దీపావళికి విడుదల కానుంది. అలాగే ‘జై భీమ్’ దర్శకుడు టి.జె. జ్ఞానవేల్‌తోనూ సూర్య ఓ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ హెచ్. వినోద్ సినిమాకంటే ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక సూర్య 49లో నాగార్జున నటించనున్నారనే వార్త నిజమైతే మాత్రం ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకుంటున్నారు అభిమానులు.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..