Manchu Manoj: మంచు మనోజ్ కంటికి గాయం?
- తిరుపతి ఎస్పీ క్యాంపు ఆఫీసులో ఎస్పీ హర్షవర్థన్ రాజుని కలిసిన నటుడు మంచు మనోజ్
- రాత్రి భాకరాపేట, నాలుగు రోజుల క్రితం F5 రెస్టారెంట్లో జరిగిన ఘటనలపై వివరించిన మనోజ్
- బయటకు వచ్చిన మనోజ్ వివరణ కోసం ఎగబడ్డ మీడియా
- లోగో తగలడంతో మనోజ్ కు కంటికి స్వల్ప గాయం
- మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన మనోజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి ఎస్పీ క్యాంప్ ఆఫీస్ లో ఎస్పీ హర్షవర్ధన్ రాజుని నటుడు మంచు మనోజ్ కలిశారు. రాత్రి భాకరాపేట, నాలుగు రోజుల క్రితం F5 రెస్టారెంట్లో జరిగిన ఘటనలపై వివరించాడు మనోజ్. అయితే అనంతరం బయటకు వచ్చిన మనోజ్ వివరణ కోసం మీడియా ఎగబడ్డ క్రమంలో ఓ ఛానల్ మైక్ లోగో తగలడంతో మనోజ్ కు కంటికి స్వల్ప గాయం అయింది. దీంతో మీడియాతో మాట్లాడకుండానే మనోజ్ వెళ్లిపోయాడు. గత రాత్రి పోలీసులకు మంచు మనోజ్ కు వాగ్వాదం చోటు చేసుకుంది. పెట్రోలింగ్ లో భాగంగా భాకరపేట సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు గెస్ట్ హౌస్ తనిఖీ కి వెళ్ళిన ఎస్ ఐ తో మనోజ్ గొడవ పడ్డారు. అయితే రాత్రి జరిగిన ఘటనపై వీడియో రిలీజ్ చేసాడు మంచు మనోజ్. మనోజ్ మాట్లాడుతూ ‘తాను ఎలాంటి తప్పు చేయలేదు, ఎక్కడ కూడా మిస్ బిహేవ్ చేయలేదు. తాను చట్టానికి లోబడే పోలీసులకు సహకరించాను.
Alia Bhat: టాలీవుడ్ పై అలియా భట్ ఫోకస్?
Also Read
పోలీసులు వచ్చి నాపై దురుసు గా వ్యవహరించారు. సీఎం దగ్గర నుంచి వచ్చానని చెప్పి ముందుగా భయపెట్టించే ప్రయత్నం చేశారు. సీఎం గారి పేరు ఎందుకు చెప్తున్నారని పోలీసులను నిలదీశాను. సీఎం గారి బందోబస్తు చూసుకొని వస్తున్నామని మళ్లీ మాట మార్చారు. సైరన్ వేసుకుని వచ్చి రిసార్ట్ లో పోలీసుల హంగామా చేశారు. నేను నా కారులో పోలీస్ స్టేషన్ కు వెళ్లాను. నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడిగాను. దానికి ఎస్ఐ ఎలాంటి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చివరికి సిఐకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పాను. నా దగ్గర మొత్తం అన్ని రికార్డులు ఉన్నాయి. నేను ఎలాంటి తప్పు చేయలేదు. యూనివర్సిటీ ముందు ఉన్న నా వాళ్ల కోసం నేను పోరాటం చేస్తున్నాను. విద్యార్థులకు న్యాయం చేయమని పోరాటం చేస్తున్నాను. నా వాళ్లపైన దాడులు చేసి విధ్వంసం సృష్టిస్తుంటే పోలీసులు ఏమి చేయట్లేదు. నాపై కావాలని లేనిపోనీవి కల్పించి నన్ను భయపెట్టాలని చూస్తున్నారు’ అని అన్నారు.
తాజావార్తలు
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!