CM Revanth Reddy Emotional Speech at Osmania University: ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి.. ఆర్ట్స్ కాలేజీ ముందు నిలబడి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలను కున్నట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చినది ఉస్మానియా యూనివర్సిటీ అని కొనియాడారు. యూనివర్సిటీకి వచ్చే ముందుకు సీఎం మీరు చాలా ధైర్యం చేస్తున్నారు అన్నారు.. సీఎంని అడ్డుకునే చరిత్ర ఉంది.. మీరెందుకు ధైర్యం చేస్తున్నారు అని చెప్పారన్నారు. నాది దైర్యం కాదు… నాది అభిమానం అని.. నా తమ్ముళ్ళు ఉన్న కాలేజీ కి పోవాలి అంటే ధైర్యం ఎందుకు? అభిమానం ఉండాలని తెలిపానన్నారు. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీటింగ్కు సీఎం రేవంత్ హాజరయ్యారు. వీసీకి రూ. వెయ్యి కోట్ల జీవోను అందించి సభను ఉద్దేశించి ప్రసంగించారు. గుండెల నిండా అభిమానంతో భవిష్యత్ ప్రణాళిక కోసం ఇక్కడికి వచ్చానన్నారు.
READ MORE: Indigo Crisis: ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం.. ఇలా ఎందుకు జరిగిందని కేంద్రానికి ప్రశ్న
మారు మూల పల్లెల నుండి వచ్చిన వాణ్ణి అని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.. మా అధికారులు కట్టలు కట్టలు పేపర్లు ఇచ్చి ఇది మాట్లాడండి అన్నారు.. మా తమ్ముళ్ళ దగ్గరికి వెళ్తే నా మనసులో ఏమంటే అది మాట్లాడతా.. చూసి మాట్లాడను.. నాకేం అనిపిస్తే అదే మాట్లాడతా అని వాళ్లతో చెప్పినట్లు వివరించారు. మనపై ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటే.. పోరాటం పుట్టుకు వస్తుందని హితవు పలికారు. దండకారణ్యంలో పుట్టిన కొమరం భీముడు చదువుకోలే.. ఆధిపత్యం చేసిన వాళ్ళపై పోరాటం పునాదిగా వేసుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం ఆరు దశాబ్దాలు ఎదురు చూశాం.. ఓయూలోనే తొలి దశ ఉద్యమం పుట్టింది.. ఆ ఉద్యమం ఫలించక పోవడంతోనే విద్యార్థులు అటవి బాట పట్టారన్నారు.. “మా తమ్ముళ్ళు ఏం అడిగారు.. స్వేచ్ఛ అడిగారు.. ఫార్మ్ హౌస్ అడిగారా..? వాళ్ళ ఆస్తుల్లో వాటా అడిగారా? లేదు.. స్వేచ్ఛ మాత్రమే అడిగారు.. ఆ స్వేచ్ఛ ఈ ప్రభుత్వం ఇస్తుంది.. మీరు గొప్ప మేధావులు గా ఎదగండి.. ఉస్మానియా యూనివర్సిటీని కాల గర్భంలో కలపాలని చూశారు.. కానీ.. ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చి దిద్దాలన్నదే నా సంకల్పం.. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాదు అంటున్నారు.. నేను గుంటూరులో చదువు కోలేదు.. గూడు పుటాని తెలియదు.. నల్లమలలో పెరిగాను.. పేదరికం చూశా.. దళితులు.. ముస్లింలతో కలిసి తిరిగాను.. నాకు భాష గొప్పగా రాకపోవచ్చు.. ప్రజల మనసు తెలుసుకునే విద్యా నాకు తెలుసు..” అని సీఎం రేవంత్రెడ్డి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.