Samantha: సమంత.. సినిమాలు చేసినా, చేయకపోయినా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నా, లేకపోయినా ట్రెండింగ్ లో మాత్రం అమ్మడి పేరు నిత్యం ఉంటూనే ఉంటుంది. నిత్యం సోషల్ మీడియాలో హల్చల్ చేసే సామ్ కొన్నిరోజులుగా ఉలుకు పలుకు లేకుండా పోయింది. అందుకు కారణాలు చాలా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో ఎవరికి తెలియదు. కొంతమంది ట్రోలర్స్ వలన దూరంగా ఉంటుంది అంటే మరికొంతమంది షూటింగ్స్ లో బిజీగా ఉందంటున్నారు. ఇంకొంతమంది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొంటుంది అందుకే సోషల్ మీడియాకు గ్యాప్ ఇచ్చింది అని చెప్పుకొస్తున్నారు.
ఇక తాజాగా ఈ వార్తలకు తోడు మరో కొత్త వార్త వచ్చి చేరింది. అదేంటంటే.. సామ్ నిజంగానే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నదట. దీనికి తోడు ఒక బాలీవుడ్ స్టార్ హీరో కొన్ని రోజులు సోషల్ మీడియాకు గ్యాప్ ఇవ్వమని, దానివలన తనకు, సినిమాకు మంచి జరుగుతుందని సలహా ఇచ్చాడట. దీంతో సామ్ సదరు హీరో చెప్పినట్లు చేస్తున్నదని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఆమె ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే దశలో ఉండడం వలన ఎవరికి కనిపించకుండా ఉంటేనే లుక్ బావుంటుందని, ఒకేసారి ఆ లుక్ చూసి అభిమానులు సర్ ప్రైజ్ అవుతారని చెప్పడంతో అది కూడా నిజమని భావించిన సామ్ సోషల్ మీడియాకు దూరంగా ఉందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది కూడా తెలియదు. ఏదిఏమైనా సామ్ అభిమానులు మాత్రం ఆమెను మిస్ అవుతున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ ముద్దగుమ్మ ఎప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతుందో చూడాలి.