Revanth Reddy: 60ఏళ్ళల్లో ఆంధ్రోళ్లు కూడా ఇంతలా అణచివేయలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో తెలంగాణ యూత్ డిమాండ్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన దాని కంటే ఇచ్చిన కూలీ ఎక్కువైందన్నారు. ఢిల్లీకెళ్ళి లిక్కర్ లో పెట్టుబడులు పెట్టేంత వ్యాపారాన్ని విస్తరించారు కేసీఆర్ అని ఆయన విమర్శించారు. 60ఏళ్ళల్లో ఆంధ్రోళ్లు కూడా ఇంతలా అణచివేయలేదని ఆయన మండిపడ్డారు.
Also Read : GVL Narasimha Rao: డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే ఏపీ అభివృద్ధి..!
ఒకప్పుడు ఉస్మానియాలోకి రావాలంటే పోలీసులు బయపడేవాళ్లు.. ప్రస్తుతం పరిస్థితి అలా లేదు.. దీనికి కారణం ఎవరు.? మధ్యయుగపు రాచరిక చక్రవర్తుల్లా కేసీఆర్ ఆలోచిస్తున్నాడు.. నక్సలైట్లల ఎజెండానే నా జెండా అన్నావు.. ఏమైంది.? మీ కుటుంబానికి పదవులు ఇవ్వాలని ఏ నక్సలైట్లల ఎజెండాలో ఉంది.? ఉద్యోగాలు ఇవ్వవొద్దని ఏఎజెండాలో ఉంది.? స్వేచ్ఛ సామజిక న్యాయం స్వయం పాలన కోసం కొట్లాడిన్రు.. అసెంబ్లీ నుంచి ఉస్మానియా వరకు నిజాంలే కట్టిన్రు.. అభివృద్ధి కార్యక్రమాలే ప్రామాణికమైతే ఎందుకు సాయుధ పోరాటం చేశారు.? సీమాంధ్రులను సరిహద్దులు దాటించిన చరిత్ర తెలంగాణది.. రాష్ట్రంలో సామజిక న్యాయం ఎక్కడుంది.?
నీ సామజికవర్గానికి పదవులు ఇస్తే అయిపోతుందా.?
Also Read
- Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
- Vaibhav Sooryavanshi: ఫీల్డింగ్‌పై విమర్శలా? అయితే ఈ క్యాచ్ చూడండి.. వైభవ్ సూర్యవంశీ అద్భుతం..
- Team India: 400 ప్లస్ స్కోర్‌తో మరో రికార్డు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్లను వెనక్కి నెట్టి..
- Ilhan Omar: జాతి నిర్మూలనలో 8వ దశకు చేరింది.. భారత్‌పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సంచలన వ్యాఖ్యలు
సామజిక న్యాయం లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాదు.. 100ఏళ్ల ఉస్మానియా వేడుకలకు వస్తే కనీసం మైక్ కూడా పట్టుకొని పరిస్థితి నీది.! స్వచ్ఛ సామాజిక న్యాయం స్వయంపాలన కోసం మళ్ళీ తెలంగాణలో అలజడి మొదలవుతుంది.. దాంట్లో నువ్వు కాలిబూడిది అవుతావు.. అరవై కోట్ల రూపాయలతో ప్రారంభమైన అమరుల స్థూపం ఇప్పుడు 200కోట్లు అంటున్నారు.. అమరుల స్థూపం కాంట్రాక్ట్ కూడా ప్రొద్దుటూరు వ్యక్తికి ఇచ్చినవ్.. ఆరేళ్ళయింది ఇంకా పూర్తి కాలేదు.. యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చినవ్.. చినజీయర్ స్వామి చెప్పినట్టు చేసినవ్.. కనీసం తెలంగాణ అమరుల స్థూపం కాంట్రాక్ట్ కూడా తెలంగాణ వ్యక్తికి ఇవ్వలేని దౌర్భాగ్యం ఉంది.. మేధావులు పెద్దలంతా ఆలోచించాలి మీ సలహాల మేరకు ముందుకు వెళతాం.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా నేను మాటిస్తున్న.. మీరు ప్రణాళిక తయారు చేయండి దాని ప్రకారం ముందుకు వెళ్తాము.. తూచా తప్పకుండా మీరిచ్చిన సూచనలు పాటిస్తా’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Ragi Pindi Upma: డయాబెటిస్, వెయిట్ లాస్ కోసం బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. రాగి ఉప్మాను సింపుల్‌గా ఇలా చేసుకోండి!
-
Ragi Barfi : ఈ ఒక్క స్వీట్ తింటే ఎముకలకు కొండంత బలం.. నోరూరించే రాగి బర్ఫీ సీక్రెట్ రెసిపీ!
-
Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
-
Vaibhav Sooryavanshi: ఫీల్డింగ్‌పై విమర్శలా? అయితే ఈ క్యాచ్ చూడండి.. వైభవ్ సూర్యవంశీ అద్భుతం..
-
Dhanush: తండ్రిలా తానే డైరెక్ట్ చేస్తాడా? లేదా వేరే వాళ్ళకి వదిలేస్తాడా?
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!