Husharu Pittalu OTT Release: అమెజాన్ ప్రైమ్‌లోకి ‘హుషార్ పిట్టలు’.. బోల్డ్ టీనేజ్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husharu Pittalu OTT Release: థియేటర్లలో విడుదలైన తర్వాత తెలుగు రొమాంటిక్ డ్రామా ‘హుషార్ పిట్టలు’ యూత్ కి బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి కూడా సిద్దమవుతోంది ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్. బోల్డ్ కథాంశం, టీనేజ్ రిలేషన్షిప్స్ తో తెరకెక్కించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. యూత్ రొమాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, సోషల్ మెసేజ్ కలిసిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. మరి ఈ మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే..
త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
‘హుషార్ పిట్టలు’ (Husharu Pittalu) సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) దక్కించుకుంది. థియేటర్లలో ఈ టీనేజ్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న విడుదలైంది. విడుదలైన 3 నుండి 4 వారాల తర్వాత, అంటే 2026 సెప్టెంబర్ మొదటి వారంలో ఆన్లైన్లో స్ట్రీమింగ్ కాబోతోందని సమాచారం. కొత్త జంట అన్షు, వాసవి గణేషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాకు బిక్షు యాదవ్ దర్శకత్వం వహించారు. రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ని కూడా పలకరించేందుకు సిద్దమవుతోంది.
Also Read
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
- Prabhas - Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
- Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
‘హుషార్ పిట్టలు’ కథ
ఈ కథ అంతా తెలంగాణలోని ఒక గ్రామానికి చెందిన రవి (అన్షు), పుట్ట చిట్టి (వాసవి గణేషన్) అనే ఇద్దరు టీనేజ్ విద్యార్థుల చుట్టూ తిరుగుతుంది. చదువుల్లో ఎప్పుడూ ఫస్ట్ వచ్చే రవి, స్నేహితుల వల్ల, స్మార్ట్‌ఫోన్ లో దొరికే ఇంటర్నెట్ చెడు ప్రభావాల వల్ల అశ్లీల కంటెంట్‌కు బానిసవుతాడు. అదే సమయంలో తొమ్మిదో తరగతి చదివే చిట్టి, రవి వైపు ఆకర్షితురాలవుతుంది. తెలిసి తెలియని వయసులో వీరి మధ్య ఏర్పడిన శారీరక ఆకర్షణ.. చివరకు చిట్టి గర్భం దాల్చే వరకు వెళ్తుంది. ఈ ఊహించని పరిణామం వల్ల ఆ ఇద్దరి చదువు, జీవితాలు ఎలా రోడ్డున పడ్డాయి ? వారి కుటుంబాలు ఎలాంటి మానసిక క్షోభను అనుభవించాయి? నేటి తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూపిస్తూ, కళ్ళు తెరిపించే కథాంశమే ఈ చిత్రం.
- Tags
- Amazon Prime Video
- cinema
తాజావార్తలు
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!