Allari Naresh : కామెడీ స్టార్ ‘అల్లరి నరేశ్’ ఈసారైనా నవ్విస్తాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన కామెడీ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న నటుడు ‘అల్లరి’ నరేశ్. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద కామెడీ చిత్రాలతో అలరించాడు నరేష్. కానీ అదంతా గతం 2012లో వచ్చిన ‘సుడిగాడు’ తర్వాత హీరోగా సరైన కామెడీ హిట్ అందుకోలేకపోయారు. ఆ తర్వాతి కాలంలో వచ్చిన పలు సినిమాలు ఆశించిన విజయాన్ని అందించలేదు.ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ చిత్రంలో రవిశంకర్ అనే భావోద్వేగపూరిత పాత్రతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా యూటర్న్ తీసుకున్నారు.
ఆ సినిమా మంచి నటుడిగా ప్రశంసలు తెచ్చిపెట్టింది. అనంతరం ‘నాంది’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’, ‘ఉగ్రం’ వంటి సీరియస్ మరియు కంటెంట్ డ్రివెన్ చిత్రాలు చేస్తూ నటనలో వైవిధ్యం చూపించినప్పటికీ ఒకప్పుడు తనను స్టార్‌ను చేసిన పూర్తిస్థాయి నవ్వుల వినోదంలో మాత్రం నరేశ్ కొంత వెనుకపడ్డారనే కామెంట్లు వచ్చాయి. అయితే చాలా కాలం తర్వాత తన మార్క్ హస్యంతో ప్రేక్షకులను నవ్వించడానికి నరేశ్ మళ్లీ సిద్ధమయ్యారు. అల్లరి నరేష్ మినిమమ్ కామెడీ ఉన్న కూడా టికెట్ కొని చూసే ఆడియెన్స్ ఉన్నారు. నరేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. చంద్రమోహన్ చింతడ దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో-ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్లో సురభి, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. “కామెడీ గోస్ కాస్మిక్” అనే ఆసక్తికర టాప్లైన్తో వస్తున్న ఈ సినిమాతో అల్లరి నరేశ్ మళ్లీ తన కామెడీ ఫామ్‌లోకి వచ్చి ప్రేక్షకులను నవ్విస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read
- Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
- Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
- Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
- Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!