Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు మోజ్తాబా నియామకం
- ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు ఎన్నిక
- మోజ్తాబా ఖమేనీ (56) ఎన్నికైనట్లుగా ఇరాన్ ప్రకటన
- కొత్త లీడర్‌ను కూడా చంపేస్తామన్న అమెరికా, ఇజ్రాయెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్ సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఖమేనీ (56) నియమితులయ్యారు. తమ పాత్ర లేకుండా ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎవరు ఎన్నికైనా చంపేస్తామని అమెరికా, ఇజ్రాయెల్ హెచ్చరించిన తర్వాత కూడా మోజ్తాబా ఖమేనీ ఎన్నిక కావడం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అత్యున్నత పదవికి ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఎన్నికైనట్లుగా ఇరాన్ మీడియా తెలిపింది.
మోజ్తాబా కూడా తండ్రిలాగే రాడికల్ మతాధికారి. సుప్రీం లీడర్ ఇరాన్‌లోని అన్ని విషయాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అధ్యక్షుడు కంటే సుప్రీం లీడర్‌కే ఎక్కువ అధికారం ఉంటుంది. మోజ్తాబాకు రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) నుంచి పూర్తి మద్దతు ఉంది. ఆ కారణంతోనే మోజ్తాబా ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యాడు.
Also Read
ఇదిలా ఉంటే కొత్త ఇరాన్ సుప్రీం లీడర్‌ను కూడా అంతమొందిస్తామని అమెరికా, ఇజ్రాయెల్ హెచ్చరించాయి. ఆదివారం ఏబీసీ న్యూస్‌తో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘మా అనుమతి లేకపోతే ఎక్కువ కాలం ఉండడు.’’ అని హెచ్చరించారు. అంతకముందే ఇజ్రాయెల్ కూడా వార్నింగ్ ఇచ్చింది. కొత్త ఇరాన్ సుప్రీం లీడర్‌ను కూడా చంపేస్తామని సూచించింది.
మోజ్తాబా..
మోజ్తాబా ఖమేనీ 1969లో ఇరాన్‌లోని మష్హాద్‌లో జన్మించారు. మతపరమైన విద్యను అభ్యషించారు. అలాగే హుజ్జతుల్-ఇస్లాం బిరుదును పొందారు. మోజ్తబా ఇరాన్-ఇరాక్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. ఇప్పటి వరకు మోజ్తబా ఖమేనీ ఎటువంటి ప్రభుత్వ పదవిని చేపట్టలేదు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరిగా ఎన్నికయ్యారు.
మోజ్తబా తండ్రికి నీడలా ఉండే వ్యక్తిగా పనిచేశాడు. ఇరాన్‌లో అధికార పీఠమైన తన తండ్రి కార్యాలయం, బీట్-ఎ రహ్బరి పనితీరులో కీలక పాత్ర పోషించారు. ఇరాన్ సాయుధ దళాలు, రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, మిలీషియా, బాసిజ్‌పై కూడా పరోక్ష నియంత్రణ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?