NTV Telugu Site icon

Revanth Reddy : కేసీఆర్, కేజ్రీవాల్, అసదుద్దీన్ ముగ్గురూ సుపారీ కిల్లర్స్

Revanth Reddyu

Revanth Reddyu

Revanth Reddy : టీఆర్ఎస్ నేడు బీఆర్ఎస్ గా ఆవిర్భవించింది. బీఆర్ఎస్ పార్టీపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. పార్టీలను మార్చే కేసీఆర్ కు కాలం చెల్లిందన్నారు. తనను ప్రజలు నమ్మే రోజులు పోయాయన్నారు. ‘టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు.. త్వరలో వీఆర్ఎస్ కాబోతోంది’ అంటూ వ్యాఖ్యానించారు. మూడోసారి అధికారం చేపట్టేందుకే రంగులు, పార్టీల పేర్లు మారుస్తున్నారంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో తెలంగాణకు కేసీఆర్‎కు పేరుబంధం తెగిపోయిందన్నారు. తెలుగు రాష్ట్రాలను ఉమ్మడిగా మార్చేందుకు కేసీఆర్ పూనుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితకు నిజామాబాద్ లో ఓటర్లు ఎలా బుద్ధి చెప్పారో..రాబోయే ఎన్నికల్లో రాష్ట్రమంతా కేసీఆర్ కు అలానే బుద్ధి చెబుతారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్నో సంక్షేమ పథకాలు, ఉద్యోగాల కల్పన చేసిన కాంగ్రెస్ కు రాష్ట్రలో జనం పట్టం కట్టబోతున్నారని చెప్పారు. నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఇంట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Alampur Ex Mla Joins in BRS: బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే

కేసీఆర్, కేజ్రీవాల్, ఆసద్దుద్దీన్ కాంగ్రెస్ ను చంపే సుపారి కిల్లర్స్ గా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని రేవంత్ స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయం మేమే అని చెబుతున్న బీజేపీ కి అంత సీన్ లేదన్నారు. నాలుగు ఎంపీ సీట్లు గెలిస్తే ప్రత్యామ్నాయం అవుతారా..? అంటూ ప్రశ్నించారు. చెరకు ఫ్యాక్టరీ తెరుస్తానని చెప్పి రైతులను కేసీఆర్ నట్టేట ముంచాడన్నారు. నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ ఇచ్చిన మోడీ పసుపు బోర్డే ఇవ్వలేదని విమర్శించారు. 80 వేల మందికి రైతుబీమా ఇచ్చానని కేసీఆర్ చెబుతున్నాడు. 80 వేల మంది మాత్రమే చనిపోయినట్లు ఎన్సీఆర్బీ లెక్కలు చెబుతున్నాయి. కానీ నిజానికి ఎనిమిదేళ్లలో లక్ష యాభై వేల మంది రైతులను కేసీఆర్ పొట్టనబెట్టుకున్నాడరని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.