కేసీఆర్ మోడల్ దేశానికి ప్రమాదమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కార్పొరేట్ రాజకీయాలుగా మార్చేశారు మోడీ అని రేవంత్ అన్నారు. కేసీఆర్.. తన మోడల్ మొదలుపెట్టారని, వేల కోట్లు సమకూర్చుతా అని బేరసారాలు మొదలుపెట్టారన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కుమార స్వామికి వందల కోట్లు ఇస్తున్నారని, కాంగ్రెస్ ని అస్థిర పరచే కుట్ర మొదలుపెట్టారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏపీ ఎన్నికలకు కూడా వందల కోట్లు ఖర్చు పెట్టారు కేసీఆర్ అని ఆరోపించాఉ. ఏ ఎన్నిక వచ్చినా కేసీఆర్ వందలాది కోట్లు ఖర్చు పెడుతున్నారని, కేసీఆర్ భూములు వనరుగా పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నారని మండిపడ్డారు. తనతో ఉన్న వాళ్లకు… భూములు పంచుతున్నారని, పార్థసారథి రెడ్డి … కేసీఆర్ సహచరుడు.. రేమిడేసివర్ బ్లాక్ లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఐటీ దాడుల్లో 140 కోట్లు దొరికాయి. కేసులు… ఉద్యోగాలు పెట్టించి తప్పుకున్నాడు. సీబీఐ..ed కేసులు ఎదుర్కొంటున్నారు పార్థసారధి. 2015 లో కేసీఆర్ కి పార్థసారధి ఓ దరఖాస్తు పెట్టుకున్నారు. క్యాన్సర్ పేషేంటల కోసం 15 ఎకరాలు కావాలని అడిగారు.
Also Read : Natty Kumar: ఆస్కార్ గ్రహీతలకు సన్మానం.. అతను లేకుండా సిగ్గుచేటు
2016 జూన్ 15 నాడు.. లేఖ రాస్తే.. 2016 జూన్ 29నాడు సాయి సింధుకు భూములు ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయి. భూముల అలాట్మెంట్ కి ఓ విధానం జీవో 571 ఉంది. దీన్ని తెలంగాణ వచ్చాకా కేసీఆర్.. 281 / 2015 జీవో తెచ్చారు. భూమి విలువ నిర్దారించండి అని ప్రదీప్ చంద్ర కలెక్టర్ కి లేఖ రాశారు. 10.8.2015 నాడు.. 15 ఎకరాల భూమి విలువ 505 కోట్లు అని తేల్చారు. సీఎస్…క్యాన్సర్ ఆసుపత్రికి 15 ఎకరాలు అవసరం లేదు. 10 ఎకరాలు చాలు అని నివేదిక ఇచ్చారు. 2018 లో ల్యాండ్ ఆలాట్ చేసింది. కేసీఆర్ 15 ఎకరాల భూమి ఇచ్చారు. లక్ష 47 వేలు రెంట్ ఇస్తే చాలు అని నిర్ణయించారు. నిజానికి ఏడాదికి 50 కోట్ల రెంట్ వసూలు చేయాలి. ప్రభుత్వ నిబంధన మేరకు.. 5,346 కోట్లు రావాలి. కానీ కేసీఆర్.. కోటి 47 లక్షలకు కట్టబెట్టారు. ఇప్పటికిప్పుడు అమ్మితే 1,500 కోట్లు వస్తాయి. బంగారం లాంటి భూమి పార్ధసారది రెడ్డి కి కోటిన్నర కు కట్టబెట్టారు. ఇంత అన్యాయం ఎక్కడైనా ఉంటాదా. అధికారుల ఆదేశాలు కాదని.. కేసీఆర్ భూమిని కట్టబెట్టారు. పార్థసారధి కోవిడ్ టైం లో 3 వేలకు అమ్మాల్సిన రేమిడేసివర్ 30 వేలకు అమ్ముకున్న పార్థసారధి పేదలకు సేవ చేస్తారు అట. దాన్ని కేసీఆర్ నమ్మారు అంట. రేపు యశోద ఆసుపత్రుల కి ఇచ్చిన భూములు ఎన్ని అనేది బయట పెడతా. భూముల వివరాలు రోజుకోకటి బయట పెడతా.’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read : Samantha Hoopes: ఆ స్విమ్ షూట్ ‘ఫ్రెండ్షిప్ బ్రాస్లెట్’ లాంటిదట!