Su-57E fighter jet: భారత్ అత్యాధునిక 5వ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ తయారీకి సిద్ధమవుతోంది. భారత్-రష్యాలు కసలి భారత్‌లోనే Su-57E ఫైటర్ జెట్ ఉత్పత్తి కోసం కోసం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే పాకిస్తాన్, చైనాలకు భయం మొదలు కావల్సిందే. ఈ చర్చలు ఫలితాలను ఇస్తే, భారత్ ‘‘మేక్ ఇన్ ఇండియా’’ కార్యక్రమానికి మరింత బలం చేకూరుతుంది. రక్షణ రంగంలో స్వావలంభన ఏర్పడుతుంది. ఇదే సమయంలో భారత్ స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసుకుంటున్న 5వ తరం యుద్ధవిమానం AMCAకు మద్దతు లభిస్తుంది. అయితే, ఈ చర్చలపై రష్యా నుంచి బలమైన సంకేతాలు ఉన్నప్పటికీ, న్యూఢిల్లీ ఇంకా దీనిపై అధికారికంగా స్పందించలేదు.
Su-57E ఫైటర్ జెట్ :
Su-57E ఫైటర్ జెట్ రష్యా తయారీ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్. ఇది ఎగుమతి వేరియంట్. శత్రుదేశాల రాడార్‌లకు చిక్కుండా దాడి చేసే సామర్థ్యం ఉంది. సూపర్ క్రూయిజ్ ఎబిలిటీ, అధునాతన ఏవియానిక్స్, సెన్సార్ ఫ్యూర్, లాంగ్ రేంజ్ ఎయిట్ టూ ఎయిర్, ఎయిర్ టూ గ్రౌండ్ ఆయుధాలతో దాడి చేసే సామర్థ్యం కలిగి ఉంది. దీంతో పాటు చైనీస్, అమెరికన్ 5వ తరం యుద్ధ విమానాలతో పోలిస్తే తక్కువ నిర్మాణ ఖర్చు దీని ప్రత్యేకత.
ఉమ్మడి తయారీ:
సుఖోయ్ Su-57 భారత్‌లో సంయుక్తంగా తయారు చేసే అంశంపై భారత్-రష్యా మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని రస్యా ఏరోస్పేస్ రంగానికి చెందిన ఉన్నతాధికారులు తెలిపారు. రష్యా యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ (UAC) కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. ఎగుమతి వేరియంట్‌ను భారత్‌లో లైసెన్స్ ఆధారంగా తయారు చేయడం ఒక ఛాయిస్ అని యూఏసీ సీఈఓ వాదిమ్ బడేఖా తెలిపారు.
Su-57 యుద్ధవిమానాలను ప్రస్తుతం ఇండియాలో Su-30ఎంకేఐ తయారు చేస్తున్న ఫెసిలిటీల్లోనే ఉత్పత్తి చేసే అవకాశం పరిశీలనలో ఉంది. తయారీలో భారత పరిశ్రమల భాగస్వామ్యం, స్వదేశీ వ్యవస్థల వినియోగం కీలకంగా ఉండే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, రష్యా ప్రభుత్వ ఆయుధ ఎగుమతిదారు రోసోబోరోనెక్స్ పోర్ట్ కూడా భారత్‌కు Su-57 యుద్ధ విమానాల సరఫరాతో పాటు దేశీయంగా ఉత్పత్తి చేసే ప్రతిపాదన చేసినట్లు రష్యన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. భారత్ స్వతహాగా అభివృద్ధి చేస్తున్న అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రోగ్రామ్‌కు సాంకేతిక సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా పేర్కొంది.AMCA 2030 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ మధ్యకాలంలో వైమానిక బలోపేతానికి 5వ తరం యుద్ధ విమానాలు చాలా కీలకంగా మారాయి.