ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన పాలమూరు ప్రజాభేరి సభలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. ఈ సభకు ప్రియాంక గాంధీ రావాల్సిందని.. కానీ, ఆమె ఆరోగ్యం బాగా లేకపోవడంతో రాలేకపోయారని చెప్పారు. మూడోసారి సీఎం అయితే ఇంకో లక్ష కోట్లు సంపాదిస్తారు కేసీఆర్ అని ఆయన ఆరోపించారు. నీ ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు పదవులు ఇచ్చావు.. మూడో సారి వస్తే వాళ్ళ ఇంట్లో మనవడు..కూడా పదవులు ఇచ్చు కోవడానికా..? అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Health Tips : రాత్రి భోజనం తర్వాత ఈ రెండింటిని తీసుకుంటే..ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
అంతేకాకుండా.. ‘తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ కి ఈ సారి అధికారం ఇవ్వండి. నల్లమల బిడ్డగా అడుగుతున్న…14 సీట్లు గెలిపించండి. పాలమూరు ను పసిడి పంటల జిల్లాగా మార్చాలి అంటే మనవాడే కీలక పదవిలో ఉండాలి. ఇవాళ నన్ను కాంగ్రెస్ అద్యక్షుడు గా.. అవకాశం ఇచ్చారు సోనియాగాంధీ. ఈ సారి.. 14 సీట్లు గెలిపించండి. మా ఆరు గ్యారెంటీ లే..మా అభ్యర్థులు. కేసీఆర్ కి బుద్ది ఉందా. కాంగ్రెస్ వస్తే రైతు బంధు రాదు అని అనడానికి బుద్ది ఉండాలి. రైతులకు 15 వేలు.. భూమి లేని వాళ్లకు 12 వేలు ఇస్తాను అని సోనియాగాంధీ చెప్పింది వినలేదా..? ఇందిరమ్మ ఇళ్ల ఇస్తాం.. దుబ్బాక లో వాళ్ళ అభ్యర్థి ని ఎవడో కత్తి తో పొడిచాడు. కేసీఆర్.. కాంగ్రెస్ మీద నెపం మోపుతున్నాడు. మేము కత్తులతో పొడిచే వాళ్ళమే అయితే..నువ్వు..ని కొడుకు..అల్లుడు తిరిగే వాళ్ళా..? దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం మా పార్టీ. చిల్లర మల్లారా మాటలు మాట్లాడితే..చూస్తూ ఊరుకునేది లేదు’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read : CBN: జైలు నుంచి బయటకు వస్తూనే దేవాన్ష్‌ను ముద్దాడిన చంద్రబాబు