CBN: జైలు నుంచి బయటకు వస్తూనే దేవాన్ష్‌ను ముద్దాడిన చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో 53 రోజుల జైలులో శిక్ష అనుభవించారు. ఇక, చంద్రబాబకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన్ని జైలు అధికారులు రిలీజ్ చేశారు. దీంతో చంద్రబాబు రిలీజ్ కావడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
Read Also: Cash For Query: బీజేపీ వద్ద ఆధారాల్లేవ్.. లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ముందు హాజరుకానున్న టీఎంసీ ఎంపీ
Also Read
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ఈ సందర్భంగా నారా భువనేశ్వరి, నారా లోకేశ్, బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌లు చంద్రబాబుకు ఎదురెల్లి స్వాగతం పలికారు. ఇకపోతే, చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ప్రధాన గేటు వరకు కాలి నడకన వచ్చారు. ఇక, 53 రోజుల తర్వాత తన మనవడు నారా దేవాన్ష్‌ను చూసిన చంద్రబాబు ఒక్కసారిగా ముద్దాడారు. ఆ తర్వాత భార్య భువనేశ్వరి, కోడలు బ్రహ్మణీ, బావమరిది నందమూరి బాలకృష్ణలతో మాట్లాడారు. ఆ తర్వాత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని ఆయన కౌగిలించుకున్నారు. ఇక, చంద్రబాబు టీడీపీ కార్యకర్తలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, టీడీపీ మహిళా నేతలు చంద్రబాబుకు హారతిలిచ్చారు.
Read Also: Anukunnavanni Jaragavu Konni: జీవితంలో ఎన్నో అనుకుంటాం కానీ కొన్నే జరుగుతాయి!
మరోవైపు, చంద్రబాబు జైలు నుంచి విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అభిమానులు, నేతలు రాజమండ్రి సెంట్రల్ జైలు ప్రధాన గేటు దగ్గరకు చేరుకుని ఆయన స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా, సెంట్రల్ జైలు దగ్గరికి టీడీపీ శ్రేణులు భారీగా రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కనీసం చంద్రబాబు ఎన్ఎస్‌జీ వెహికిల్స్ కూడా వెల్లలేనంతగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు మోహరించారు. జై చంద్రబాబు జైజై చంద్రబాబు అంటూ నినాదాలతో రాజమహేంద్రవరం సెంట్రల్ ప్రాంగణం మొత్తం మార్మోగిపోయింది.
తాజావార్తలు
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?