అన్నం తినడం వల్ల కడుపు త్వరగా నిండినట్లు అనిపిస్తుంది.  మూడు పూటలా అన్నమే తింటే పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని చాలా మందికి తెలియదు..! 

ఉడికించిన బియ్యంలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అన్నం ఎక్కువగా తినడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. అన్నం శరీరంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. 

అన్నంలో కేలరీల పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. రోజూ అన్నం తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. బరువు అదుపులో ఉండాలంటే అన్నం పరిమితంగానే తినాలి.

మీకు అన్నం తినడమే ఇష్టమైతే వైట్ రైస్ కాకుండా.. బ్రౌన్ రైస్ తినాలి. ఇది మంచి హెల్తీ ఫుడ్. 

తెల్ల బియ్యంలో పీచు పదార్థం ఎక్కువగా ఉండదు. అలాంటప్పుడు ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల గ్యాస్ సమస్య వస్తుంది. కొన్నిసార్లు కడుపు ఉబ్బినట్లు అనిపిస్తుంది. 

మీరు ఆఫీసులో లేదా ఇంట్లో లంచ్ సమయంలో కడుపునిండా అన్నం తింటే.. తిన్న కొద్దిసేపటికే మీకు నిద్ర వస్తుంది. శరీరంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల ఇలా జరుగుతుంది. 

అన్నం ఎక్కువగా తింటే శరీరం నీరసంగా మారి.. బద్ధకం పెరుగుతుంది.

అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన నివేదికలో అన్నాన్ని ఎక్కువగా తినడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని తెలుపుతున్నారు.

వైట్ రైస్ తినడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ సమస్య రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి నెలకు ఒకసారి మాత్రమే వైట్ రైస్ తినడం మంచిదని నిపుణులు పేర్కొన్నారు.