NTV Telugu Site icon

Revanth Reddy On Rythu Bharosa: రైతు భరోసాపై సందేహాలు అవసరం లేదంటున్న సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy On Rythu Bharosa: తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకం గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. రైతు భరోసా పథకంపై వివిధ అంశాలను ఆయన వెల్లడించారు. రైతు భరోసా పై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, ఇందిరాగాంధీకి ఉన్న చరిత్ర అందరికీ తెలుసునని అన్నారు. రైతు బందు ఉద్దేశం వ్యవసాయ పెట్టుబడికి సహాయం చేయడమని ఆయన అన్నారు. గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద రూ. 72 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయితే, ఈ పథకంలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయని అన్నారు.

Also Read: Free Bus Scheme in AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం కొనసాగించారు. కేసీఆర్ అనుభవం, నాయకత్వాన్ని మేము అంగీకరిస్తున్నాం. కానీ, కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకోవాలని.. కేవలం గొప్పగా మాట్లాడటం కాదు, పేద రైతు వరకు ప్రభుత్వ పథకాలు అందించాలని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి తన నాయకత్వంలో రైతుల రుణమాఫీ చేయడం విధానాన్ని తెలిపారు. మేము రైతుల రుణమాఫీకి ముందుగానే చర్యలు తీసుకున్నామని, రైతులపై వడ్డీ భారం ఉండకూడదు కాబట్టి మేము ముందుగానే పని చేశామని ఆయన అన్నారు.

Also Read: Drone Attacks in Russia: అమెరికాలో 9/11 దాడి వలె.. భవనాలపై డ్రోన్ దాడులు

ఆ తరువాత స్విస్ బ్యాంకులోని బిల్లులపై విమర్శలు గుప్పించిన ఆయన, రాజకీయ నాయకులు స్విస్ బ్యాంకుకు కూడా అప్పు ఇచ్చే స్థాయిలో ఉన్నారు. 8 వేల కోట్లు కూడా లేవని కేసీఆర్ సభలోనే చెప్పారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చివరగా, తెలంగాణ రాష్ట్రం ఆర్థిక పరిస్థితిపై కూడా మాట్లాడారు. రూ. 72 వేల కోట్లు అప్పులు చేసిన 16 మంది ముఖ్యమంత్రులు వాటి మీద పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

Show comments