Drone Attacks in Russia: అమెరికాలో 9/11 దాడి వలె.. భవనాలపై డ్రోన్ దాడులు
- అమెరికాలో 9/11 దాడి వలె..
- రష్యాలోని కజాన్ నగరంలో 6 భవనాలపై డ్రోన్ దాడి
- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Breaking news Drone Attacks in Russia: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ఘర్షణలో.. తాజాగా కజాన్ నగరంలో 6 భవనాలపై డ్రోన్ దాడి జరిగింది. శనివారం ఉదయం, ఉక్రెయిన్ నుండి వచ్చే అనుమానిత డ్రోన్లు రష్యా కజాన్ నగరంలోని భారీ అంతస్తుల నివాస భవనాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయి. రష్యాలోని కజాన్ నగరంలో కనీసం 6 భవనాలపై డ్రోన్ దాడులు జరిగాయి. ప్రస్తుతం ఈ ఘటనలకు సంబంధించి అనేక ఫోటోలు, వీడియోలు పెద్దెత్తున వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం, డ్రోన్‌లు భవనాలను ఢీకొన్నాయి. ఆపై పెద్ద పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ దాడిని 9/11 లాంటి దాడిగా అభివర్ణిస్తున్నారు. నిజానికి, అమెరికాలో 9/11 దాడి చాలా పెద్దది. విమానాలు భవనాలను ఢీ కొనగా.. ఆ దాడిలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. అయితే రష్యాలో జరిగిన దాడుల్లో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.
UAVs have hit at least three high-rise buildings in Kazan, Russia
Also Read
Photos and videos from the scene are being shared on local Telegram channels. pic.twitter.com/MN19u47uom
— NEXTA (@nexta_tv) December 21, 2024
Also Read: Range Rover Sport Launched: భారత్‌లో తొలి మెడ్ ఇన్ ఇండియా రేంజ్ రోవర్ స్పోర్ట్ SUV లాంచ్
⚡️ Drones attack Kazan high-rise building, residents evacuated pic.twitter.com/p6ZBHoRjqj
— RT (@RT_com) December 21, 2024
ఉక్రెయిన్ ఈ దాడికి పాల్పడినట్లు రష్యా మీడియా పేర్కొంది. అయితే, ఉక్రెయిన్ ఈ దాడికి బాధ్యత వహించలేదు. రష్యాలోని కజాన్ నగరం సురక్షితమైన, ప్రశాంతమైన నగరాలలో ఒకటి. కజాన్‌లో విమాన రాకపోకలు ప్రస్తుతానికి నిలిపివేయబడ్డాయి. ప్రపంచంలోని అగ్రరాజ్యాలలో రష్యా ఒకటి. రష్యా ఈ విషయంపై సిరీస్ గా స్పందిస్తే యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రంగా మారవచ్చు. గతంలో రష్యాలోని రిల్స్క్‌లో ఉక్రెయిన్ క్షిపణి దాడిలో చిన్నారి సహా ఆరుగురు చనిపోయారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!