కుక్కల జనన నియంత్రణ ఆపరేషన్ కేంద్రాలను హైదరాబాద్ బయట ఏర్పాటు చేయాలన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సోమవారం ఆయన మాట్లాడుతూ.. అంబర్‌పేటలో ఉన్న కుక్కలను బయటకు తరలించాలన్నారు. కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. బాలుడి మృతికి జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని, అంబర్‌పేటలో కుక్కలకు ఆపరేషన్ చేసి వదిలివేయడం కారణంగా వాటి సంఖ్య పెరిగిందని ఆయన అన్నారు.
అంబర్‌పేట ఘటనలో చనిపోయిన బాలుడు ప్రదీప్‌కు జీహెచ్ఎంసీ పరిహారం ప్రకటించింది. ప్రదీప్ కుటుంబానికి రూ.8 లక్షలు పరిహారం అందించాలని జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ నిర్ణయించింది. బాలుడి కుటుంబానికి తమ నెల రోజుల వేతనం విరాళంగా ఇవ్వాలని కార్పోరేటర్లు తీర్మానించింది.
Also Read : Manchu Manoj: రాజకీయాల ఆలోచన లేదు, ప్రజా సేవ చెయ్యాలన్న కోరిక వుంది
కాగా.. హైదరాబాద్ అంబర్‌పేట్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారి ప్రదీప్ తన తండ్రితో కలిసి ఆయన పనిచేసే ప్రాంతానికి వెళ్లాడు. అయితే తండ్రి పనిచేసుకుంటూ వుండటంతో అక్కడికి సమీపంలోనే వున్న అక్క దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాయో కానీ మూడు వీధి కుక్కలు.. చిన్నారిని చుట్టుముట్టాయి. అవి అరుస్తూ, దాడి చేస్తుండటంతో బాలుడు భయాందోళనలకు గురయ్యాడు. తప్పించుకునేందుకు ఆ చిన్నారి ఎంతగా ప్రయత్నించినప్పటికీ.. ఫలితం దక్కలేదు. ఆ కుక్కలు చిన్నారిపై దాడి చేస్తూ నోట కరచుకుని దాడి చేశాయి.
Also Read : Sathwik Suicide : కాలేజీ వేధింపుల వల్లే సాత్విక్ ఆత్మహత్య.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
ఇదిలా ఉంటే.. తెలంగాణలో మహిళలపై కొనసాగుతున్న అఘాయిత్యాలకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీనంగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈటెల రాజేందర్, విజయ శాంతి, అరవింద్ మీనన్, మహిళ కార్పొరేటర్ లు, నేతలు ఈ నిరసన దీక్షలో పాల్గొన్నారు.