Stephen Fleming Coach: మొదటిసారి కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్.. కీలక మార్పులకు నాంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stephen Fleming Set to Become England Test Head Coach: ఇంగ్లండ్ టెస్టు జట్టుకు కొత్త హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మాజీ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరు బలంగా వినిపిస్తోంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్వహించిన పలు ఇంటర్వ్యూల అనంతరం ఫ్లెమింగ్ వైపే మొగ్గు చూపుతోందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇటీవల సీఎస్కేతో తన దీర్ఘకాల ప్రయాణం ముగించిన ఫ్లెమింగ్‌కు ఇది తొలి అంతర్జాతీయ కోచింగ్ బాధ్యత కానుంది. ఇంగ్లండ్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎంపికైతే తన మాజీ సహచరుడు బ్రెండన్ మెకల్లమ్‌తో కలిసి పనిచేయనున్నారు.
ఇటీవల టెస్టు జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న మెకల్లమ్.. ప్రస్తుతం ఇంగ్లండ్ వైట్‌బాల్ జట్ల కోచ్‌గా కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ తరఫున ఎన్నో సంవత్సరాలు కలిసి ఆడిన ఈ ఇద్దరు దిగ్గజాలు ఇప్పుడు ఇంగ్లండ్ క్రికెట్లో మరోసారి జట్టుకట్టే అవకాశముంది. డిసెంబర్లో దక్షిణాఫ్రికా పర్యటనతో ఫ్లెమింగ్ అధికారికంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ 10 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. 2015 తర్వాత ఆస్ట్రేలియాపై యాషెస్ సిరీస్‌ను గెలవని ఇంగ్లండ్‌కు తిరిగి ఆ ట్రోఫీని అందించడమే ఫ్లెమింగ్ ముందున్న తొలి పెద్ద సవాల్‌గా భావిస్తున్నారు.
Also Read
- Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
- Afghanistan Tri Series Win: అద్భుత ఫామ్‌తో దూసుకుపోతున్న ఆఫ్ఘనిస్థాన్.. ట్రై సిరీస్ కైవసం..
- Ishan Kashan Replace: గాయంతో మ్యాచ్‌కు దూరమైన ఇషాన్ కిషన్.. అతడి స్థానంలో కీలక ప్లేయర్‌ను సెలెక్ట్ చేసిన బీసీసీఐ..
- IND vs NZ 2nd T20I: నేడు భారత్-న్యూజిలాండ్ రెండో టీ20.. లైవ్ స్ట్రీమింగ్, పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 ఇదే!
జట్టు హెడ్ కోచ్ పదవికి రిచర్డ్ డాసన్, జోనాథన్ ట్రాట్, టామ్ మూడీ, జస్టిన్ లాంగర్ వంటి ప్రముఖుల పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చినప్పటికీ.. చివరికి ఫ్లెమింగ్ ముందంజలో నిలిచినట్లు తెలుస్తోంది. తొలుత ఆండీ ఫ్లవర్‌ను ఈసీబీ ప్రధాన అభ్యర్థిగా భావించినా.. ఆయన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీలతో ఉన్న ఒప్పందాల కారణంగా ఆసక్తి చూపలేదని సమాచారం. మరోవైపు జస్టిన్ లాంగర్ కూడా ఈసీబీతో ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశాడు. కోచ్ నియామక ప్రక్రియ మొత్తాన్ని ఇంగ్లండ్ క్రికెట్ డైరెక్టర్ రాబ్ కీ పర్యవేక్షిస్తున్నాడు.
2007లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టీఫెన్ ఫ్లెమింగ్.. 2009లో చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆయన మార్గదర్శకత్వంలో సీఎస్కే ఐదు ఐపీఎల్ టైటిళ్లు (2010, 2011, 2018, 2021, 2023) గెలుచుకుంది. మొత్తం 10 ఐపీఎల్ ఫైనల్స్‌కు జట్టును చేర్చిన ఫ్లెమింగ్.. ఛాంపియన్స్ లీగ్ టీ20తో కలిపి 11 ప్రధాన టీ20 ఫైనల్స్‌లో ఏడు ట్రోఫీలు సాధించిన ఘనతను అందుకున్నాడు. అలాగే టెక్సాస్ సూపర్ కింగ్స్ (ఎంఎల్సీ), జోబర్గ్ సూపర్ కింగ్స్ (ఎస్ఏ20) జట్లకు కూడా కోచ్‌గా వ్యవహరించాడు. అయితే ఆ లీగ్‌ల్లో మాత్రం ట్రోఫీ ఫ్లెమింగ్ మార్క్ కనపడలేదు.
ఇటీవల టెస్టు జట్టులో వరుస వైఫల్యాల తర్వాత బ్రెండన్ మెకల్లమ్‌ను టెస్టు కోచ్ బాధ్యతల నుంచి తప్పించిన ఈసీబీ.. ఇప్పుడు ఎంతో అనుభవం ఉన్న ఫ్లెమింగ్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. పాకిస్థాన్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో జో రూట్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నప్పటికీ.. భవిష్యత్‌లో శాశ్వత కెప్టెన్ ఎంపికపై తుది నిర్ణయం కొత్త కోచ్‌దే కానుంది. ప్రస్తుతం వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా ఆ రేసులో ఉన్నాడు. దీంతో ఫ్లెమింగ్ ఎంపిక ఇంగ్లండ్ టెస్టు క్రికెట్లో కీలక మార్పులకు నాంది పలకనుంది.
తాజావార్తలు
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
AP MPTC ZPTC Elections 2026: MPTC, ZPTC ఎన్నికల్లో భారీగా నామినేషన్లు.. పార్టీల వారీగా లెక్కలివే
-
Melania Trump: ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలపై మెలానియా ట్రంప్ కీలక ప్రకటన
-
Afghanistan Tri Series Win: అద్భుత ఫామ్‌తో దూసుకుపోతున్న ఆఫ్ఘనిస్థాన్.. ట్రై సిరీస్ కైవసం..
-
Ishan Kashan Replace: గాయంతో మ్యాచ్‌కు దూరమైన ఇషాన్ కిషన్.. అతడి స్థానంలో కీలక ప్లేయర్‌ను సెలెక్ట్ చేసిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!