India On PoK: ‘‘పాకిస్తానీ కాశ్మీర్ అనేదే లేదు’’.. NYT కథనంపై భారత ఆగ్రహం
- ‘‘పాకిస్తానీ కాశ్మీర్ అంటూ’’ పీఓకే నిరసనలపై న్యూయార్క్ టైమ్స్ కథనం..
- అలాంటి ప్రాంతమే లేదని, అది ‘‘పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్’’ అని స్పష్టం చేసిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India On PoK: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)పై ది న్యూయార్క్ టైమ్స్ (NYT) ప్రచురించిన కథనంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తి చేసింది. ‘‘పాకిస్తానీ కాశ్మీర్’’ అనే పదాన్ని ఉపయోగించడంపై అభ్యంతరం తెలిపింది. ‘‘పాకిస్తానీ కాశ్మీర్ అనేదే లేదు.. అది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్’’ అని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.
పీఓకేలో గత కొంత కాలంగా అక్కడి ప్రజలు హక్కుల కోసం, ఎన్నికల్లో కాశ్మీర్ శరణార్థులకు రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్నారు. దీనిపై వార్తను కవర్ చేస్తూ ‘‘”Clashes Erupt in Pakistani Kashmir as Voting in Local Election Begins” అనే శీర్షికతో న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. అయితే, ఈ హెడ్డింగ్‌ను భారత్ తప్పుపట్టింది. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘‘ఈ హెడ్డింగ్ తప్పుదారి పట్టించేలా ఉంది. పాకిస్తానీ కాశ్మీర్ అనే ప్రాంతం లేదు, అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాత్రమే’’ అని పేర్కొంది.
Also Read
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
- Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
- IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
- Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
జమ్మూ కశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని, అవి ఎప్పటికీ భారతదేశంలోనే విడదీయరాని భాగాలుగా ఉంటాయని స్పష్టం చేసింది.పాకిస్తాన్ ఆక్రమించిన ప్రాంతంలో ప్రజలపై హింసకు పాల్పడుతుందని ఆరోపించింది. ఇదిలా ఉంటే, న్యూ్యార్క్ టైమ్స్ కథనంలో పీఓకేలోని మీర్పూర్ ప్రాంతంలో ఎన్నికల సందర్భంగా పోలీసులు, పౌరహక్కుల సంఘం కార్యకర్తలకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తన కథనంలో పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ స్వతంత్ర విచారణ జరపాలని కోరింది. పాకిస్తాన్ సైన్యం ఈ ఉద్యమాన్ని అణచివేస్తోంది. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 30 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?