Team India: ప్రతి ఒక్కరు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే: జై షా
- డొమిస్టిక్ అత్యుత్తమ వేదిక
- వారికి మాత్రమే కొన్ని మినహాయింపులు
- సెప్టెంబర్ 5 నుంచి దులీప్ ట్రోఫీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాయాల కారణంగా ఆటకు దూరమై.. మళ్లీ జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోసారి ఇదే విషయంపై ఆయన స్పష్టత ఇచ్చారు. భారత క్రికెటర్లు తమ ఫిట్‌నెస్, ఫామ్‌ను నిరూపించుకోవాలంటే.. డొమిస్టిక్ అత్యుత్తమ వేదిక అని జై షా పేర్కొన్నారు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి వారికి మాత్రమే కొన్ని మినహాయింపులు ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా రవీంద్ర జడేజా గాయంను గుర్తుచేశారు.
‘రెండేళ్ల క్రితం రవీంద్ర జడేజాకు గాయం అయింది.కోలుకున్న తరువాత దేశవాళీలో ఆడమని నేనే కోరా. ఇప్పుడు దాన్ని తప్పనిసరి చేశాం. క్రికెటర్ల విషయంలో మేం స్ట్రిక్ట్‌గా ఉందామనుకున్నాం. ఎవరైనా గాయాలకు గురై విరామం తీసుకొని.. మళ్లీ జాతీయ జట్టులోకి రావాలని భావిస్తే ఫిట్‌నెస్ నిరూపించుకోవాలి. వారు దేశవాళీ క్రికెట్‌ను వేదికగా చేసుకోవాలి. విరాట్, రోహిత్, బుమ్రా వంటి టాప్ క్రికెటర్లకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. దేశవాళీలో ఆడుతూ గాయపడితే జట్టుకు చాలా నష్టం. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో టాప్ క్రికెటర్లు ఆడటం మనం చూడలేదు. మన ప్లేయర్లకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే గాయపడిన వారి పరిస్థితి వేరు’ అని జై షా చెప్పారు.
Also Read
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
- Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
- Ram Lakshman Masters: 'ది ప్యారడైజ్' సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
Also Read: Raksha Bandhan 2024: సోదరులకు రాఖీ కట్టి.. తుదిశ్వాస విడిచిన యువతి!
సెప్టెంబర్ 5 నుంచి దులీప్ ట్రోఫీ 2024 ప్రారంభం కానుంది. శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ కెప్లెన్లుగా వ్యవహరిస్తారు. దాదాపు అందరు భారత క్రికెటర్స్ ఈ టోర్నీలో ఆడుతున్నారు. సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన ఇషాన్ కిషన్ కూడా ఆడనున్నాడు. కోహ్లీ, రోహిత్ , బుమ్రా, అశ్విన్‌లు టోర్నమెంట్ మొదటి రౌండ్‌లో ఆడనున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
-
Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
-
Release Postpone : పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?”
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!