కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తన వాదనలను నిరూపించేందుకు ఈసీని వారం రోజుల సమయం కావాలని కోరారు. దానికి ఎన్నికల సంఘం నిరాకరించింది. జూన్ 4న జరగనున్న లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు 150 మంది జిల్లా మేజిస్ట్రేట్లు, కలెక్టర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని జైరాం రమేష్ ఆరోపించారు. ఈ క్రమంలో ఈసీ.. వాస్తవ వివరాలను బయటపెట్టాలని కోరింది. ఆదివారం సాయంత్రం లోగా వివరాలు తెలియజేయాలని తెలిపింది. కాగా.. అందుకు వారం రోజుల గడువు ఇవ్వాలని సోమవారం ఈసీకి లేఖ రాశారు.
Read Also: Anantapur: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఓట్ల లెక్కిపు ఇలా..
ఈ నేపథ్యంలో ఈసీ స్పందిస్తూ.. సమయాన్ని పొడిగించాలన్న మీ అభ్యర్థనను కమిషన్ పూర్తిగా తిరస్కరిస్తుందని తెలిపింది. సోమవారం సాయంత్రం 7 గంటలలోపు మీ ఆరోపణ వాస్తవాలను తెలపాలని కోరింది. ఒకవేళ ఆధారాలు సమర్పించని ఎడల ఈసీ తమపై తగిన చర్య తీసుకుంటుందని తెలిపింది. రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులైన దాదాపు 150 పార్లమెంట్ నియోజకవర్గాల జిల్లా మేజిస్ట్రేట్లను ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందని జైరాం రమేష్ ఆరోపించడంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. జయరాం ఆరోపించినంతగా ఏ డీఎం కూడా అనవసర ప్రభావం చూపలేదని ఎన్నికల సంఘం పేర్కొంది.
Read Also: Pakistan: సైఫర్ కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఊరట.. నిర్దోషిగా ప్రకటన
కాగా.. శనివారం ఎన్నికలు ముగిసిన అనంతరం అమిత్ షా.. కలెక్టర్లు, జిల్లా మేజిస్ట్రేట్లను పిలిచి భయపెడుతున్నారని జైరాం రమేష్ ఎక్స్ లో తెలిపారు.ఇప్పటి వరకు అతను 150 మందితో మాట్లాడారని పేర్కొన్నారు. అధికారులు ఎటువంటి ఒత్తిడికి గురికాకూడదని పోస్ట్ చేశారు.