ఇజ్రాయెల్ చరిత్రలో మరొక అద్భుతమైన ఘటన ఆవిష్క్రతమైంది. గత కొన్ని నెలలుగా గాజాతో ఎడతెరిపిలేకుండా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. దాదాపుగా గాజాను మట్టుబెట్టింది. ఇజ్రాయెల్ సైన్యంలో ఇదంతా ఒకెత్తు అయితే.. గురువారం ఐడీఎఫ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన అమ్మాయిను ఐడీఎఫ్ దళాలు రక్షించాయి.
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 40 రోజుల పసికందు.. ఆమె ఆరేళ్ల సోదరుడు ప్రాణాల కోసం పోరాడుతుండగా.. వారిద్దరినీ రెస్క్యూ టీమ్ సురక్షితంగా రక్షించింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వరదల్లో కొట్టుకుపోయారు. వారి ఇల్లు కూడా ధ్వంసమైంది. అయితే.. ఆ కుటుంబంలో పసికందు అనారా, సోదరుడు మహ్మద్ హయాన్ సురక్షితంగా బయటపడ్డారు.
సిక్కింలో భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తర సిక్కింలో చిక్కుకుపోయిన 500 మందికి పైగా పర్యాటకులను రక్షించారు. భారీ వర్షాల మధ్య బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) వారిన సేఫ్ చేసింది. మంగన్ నుండి లాచుంగ్ మార్గంలో పెద్ద ఎత్తున వరదలు రావడంతో.. 15,000 మంది పర్యాటకులు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్నారు. మరోవైపు.. భారీ వర్షాలు, వరదల ధాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. అంతేకాకుండా.. రోడ్డు రవాణాకు తీవ్ర అంతరాయం…
మధ్యప్రదేశ్లో మద్యం ఫ్యాక్టరీ నుంచి రక్షించిన 39 మంది చిన్నారులు అదృశ్యమయ్యారు. శనివారం నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) ఆధ్వర్యంలో రైసెన్‌లోని ఓ లిక్కర్ ఫ్యాక్టరీపై రైడ్ చేశారు. అందులో బాల కార్మికులు ఉన్నట్లు గుర్తించి దాడి చేయగా.. 39 మంది బాల కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. తర్వాత ఉన్నట్టుండి పిల్లలు మిస్సింగ్ అయినట్లు ఎన్‌సీపీసీఆర్(NCPCR) చైర్మన్ తెలిపారు. అంతకుముందు.. బాలకార్మికులను రక్షించిన తర్వాత ఎన్‌సీపీసీఆర్ బృందం చిన్నారుల చేతులపై…
డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షన్నర వరకు సొమ్ములు తీసుకుని కంబోడియాకు తీసుకెళ్లిన యువకులను ఇండియన్ ఎంబసీ సమన్వయం తో విశాఖకు తీసుకొచ్చినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ రవి శంకర్ అయ్యనార్ వెల్లడించారు. బాధితులు ఇంటికి చేరుకోవడానికి పోలీసు శాఖ పని చేస్తోందని తెలిపారు.
పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న చిన్నారులను రెస్క్యూ ఆపరేషన్ చేసి ఉత్తరప్రదేశ్ చైల్డ్ కమిషన్ రక్షించింది. 95 మంది చిన్నారులను అధికారులు రక్షించారు. బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తుండగా చాకచక్యంగా చిన్నారులను కాపాడారు.
ఒకటి, రెండు రోజుల వయస్సులోపు శిశువుల అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా సీబీఐ బట్టబయలు చేసింది. ఢిల్లీ, హర్యానాలో జరిపిన దాడుల్లో 1.5 రోజులు, 15 రోజులు, ఒక నెల వయసున్న ముగ్గురు శిశువులను సీబీఐ ముఠా బారి నుంచి రక్షించింది. వీరిలో ఇద్దరు మగ శిశువులు, ఒక నెల వయసున్న ఆడ శిశువు ఉన్నారు.
Florida Woman: ఆపదలో ఉన్నప్పుడు మనకు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనల్ని మనం కాపాడుకోవడానికి ఎవరు ఆలోచించని విధంగా వినూత్నంగా ఆలోచిస్తూ ఉంటాం. ఇక ఫ్లోరిడాలో ఆపదలో ఉన్న ఓ మహిళ కూడా డిఫరెంట్ గా ఆలోచించి తనతో పాటు తన ఇద్దరి పిల్లలను కూడా రక్షించుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఫ్లోరిడాకు చెందిన చెరిల్ ట్రెడ్‌వే అనే మహిళను తన ఇద్దరి పిల్లలతో సహా ఆమె బాయ్ ఫ్రెండ్ ఈతాన్ ఎర్ల్ నికెర్సన్ బంధించాడు. వారిని అనేక…