US House Speaker: ఎట్టకేలకు ప్రతినిధుల స్పీకర్‌గా కెవిన్ మెక్‌కార్తీ ఎన్నిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US House Speaker: ఎట్టకేలకు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ రిపబ్లికన్ పార్టీకి చెందిన కెవిన్ మెక్‌కార్తీ ఎన్నికయ్యారు. నాలుగు రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి ముగింపు పలుకుతూ మెక్‌కార్తీకి పలువురు నేతలు మద్దతు తెలిపారు. రిపబ్లికన్ పార్టీ నేతల మధ్య అంతర్గత కలహాలతో 15 రౌండ్ల హైడ్రామా తర్వాత స్పీకర్‌ను ఎన్నుకున్నారు. నిజానికి ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు ఆధిపత్యం ఉన్నా.. కొందరు రెబల్స్ వల్ల తీవ్ర పోరాటం చేయాల్సి వచ్చింది. స్పీకర్ ఎన్నిక కోసం నాలుగు రోజులుగా ఓటింగ్ జరుగుతోంది. ఎట్టకేలకు మెక్‌కార్తీ 216 ఓట్లతో అమెరికా హౌజ్ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అమెరికా కాంగ్రెస్ 160 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యంత సుదీర్ఘ కాలం సాగిన స్పీకర్ ఎన్నికగా నిలించింది. మెక్‌కార్తీని స్పీకర్‌గా ఎన్నుకునేందుకు రిపబ్లికన్ నేతలు 15 రౌండ్ల ఓటింగ్ వరకు తీసుకెళ్లారు.
Iran: భద్రత అధికారి హత్య కేసు.. ఇద్దరు హిజాబ్ వ్యతిరేక నిరసనకారులకు ఉరిశిక్ష
Also Read
- Yashpal Sharma: 1983 ప్రపంచకప్‌లో అసలైన సూపర్‌మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
- 7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
- రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
- Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
ప్రతినిధుల సభలో స్పీకర్ ఎన్నిక కోసం మొత్తం 428 మంది ఓటేశారు. దాంట్లో మెక్‌కార్తీకి 216 ఓట్లు రాగా, డెమోక్రటిక్ అభ్యర్థి హకీమ్ జెఫ్రీస్కి 212 ఓట్లు ఓట్లు వచ్చాయి. కెవిన్‌కు మెజారిటీ వచ్చిందని, ఆయనే హౌజ్ స్పీకర్ అని క్లర్క్ చెర్లి జాన్సన్ ప్రకటించారు. హౌజ్ ఎజెండా, లెజిస్లేటివ్ బిజినెస్ మొత్తం స్పీకర్ ఆధీనంలో ఉంటుంది. ఇక కొత్తగా ఎన్నికైన సభ్యుల నియామకం కూడా ఆయన చేతుల్లోనే ఉంటుంది. దీని వల్లే స్పీకర్ ఎన్నిక అంశం కీలకంగా మారింది. మెక్‌కార్తీ ఇప్పుడు నాన్సీ పెలోసీ తర్వాత ప్రతినిధుల సభ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుల తర్వాత హోదాలో స్పీకర్ నిలుస్తారు. స్పీకర్‌గా విజయం సాధించిన మెక్‌కార్తీకి డోనాల్డ్ ట్రంప్ కంగ్రాట్స్ చెప్పారు.
తాజావార్తలు
-
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
-
Gaja Teaser: ప్రేమించిన అమ్మాయినే చంపేశాడు.. లవ్ స్టోరీలో ఇంత షాకింగ్ ట్విస్ట్ ఏంటి?.. ‘గజ’ టీజర్ అదిరిందిగా!
-
Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
-
Yashpal Sharma: 1983 ప్రపంచకప్‌లో అసలైన సూపర్‌మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
-
Ajith Kumar : అజిత్ కుమార్ – విక్టరీ వెంకటేష్ – మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!