అగ్రరాజ్యం అమెరికా దివాళా అంచున కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు అప్పులు పెరిగిపోయి.. మరోవైపు కొత్త అప్పులు తీసుకునే అవకాశం లేక బైడెన్ సర్కార్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెలెన్ చేతులెత్తేశారు. జూన్ 1 వరకు కాంగ్రెస్ అప్పుల పరిమితి పెంచకపోతే.. దివాళా తీయడం ఖాయమని తేల్చి చెప్పారు. దివాళా అంచు వరకు వచ్చాక.. బైడెన్ సర్కార్‌కు కాస్త ఊరట లభించింది.
ఎట్టకేలకు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ రిపబ్లికన్ పార్టీకి చెందిన కెవిన్ మెక్‌కార్తీ ఎన్నికయ్యారు. నాలుగు రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి ముగింపు పలుకుతూ మెక్‌కార్తీకి పలువురు నేతలు మద్దతు తెలిపారు. రిపబ్లికన్ పార్టీ నేతల మధ్య అంతర్గత కలహాలతో 15 రౌండ్ల హైడ్రామా తర్వాత స్పీకర్‌ను ఎన్నుకున్నారు.