Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shikhar Dhawan, Ajinkya Rahane Pay Tribute To Nana Patekar: ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ (75) ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన మృతి చెందారు. భారతీయ సినిమాల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన మరణవార్తతో అభిమానులు విషాదంలో మునిగిపోయారు. నానా పటేకర్ మృతిపై సినీ, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మాజీ భారత క్రికెటర్లు శిఖర్ ధావన్, అజింక్య రహానే ఆయనకు నివాళులర్పించారు. నానా పటేకర్ నటన తరతరాలకు స్ఫూర్తినిస్తుందని, ఎన్నో ఏళ్ల పాటు ప్రేక్షకులను అలరించారని కొనియాడారు.
నానా పటేకర్ మృతి పట్ల శిఖర్ ధావన్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. భారతీయ సినిమా ఒక గొప్ప ప్రతిభావంతుడిని కోల్పోయిందని పేర్కొన్నాడు. ‘భారతీయ సినిమా ఈరోజు ఒక గొప్ప ప్రతిభావంతుడిని కోల్పోయింది. నానా పటేకర్ సాబ్.. మీ నటన తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఓం శాంతి’ అంటూ గబ్బర్ తన సంతాపాన్ని తెలియజేశాడు. నానా పటేకర్ అసాధారణ నటుడని, తన నటనతో ఎన్నో తరాల ప్రేక్షకులకు స్ఫూర్తినివ్వడంతో పాటు వినోదాన్ని అందించారని అజింక్య రహానే పేర్కొన్నాడు. ఆయన మరణవార్త విని ఎంతో బాధ కలిగిందని, నానా పటేకర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు జింక్స్ తెలిపాడు.
Also Read
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Ram Gopal Varma: "ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది".. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
- Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
- Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
నానా పటేకర్ ఈరోజు ఉదయం 5:20 గంటలకు కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూసినట్లు మణిపాల్ ఆస్పత్రి ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ శేఖర్ సాల్కర్ ఏఎన్ఐకి తెలిపారు. గోవాలోని తన నివాసంలో ఆయన అపస్మారక స్థితిలో కనిపించడంతో వైద్య సహాయం అందించారు. దాదాపు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని వైద్యులు తెలిపారు. హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో నానా పటేకర్ ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందారు. 1978లో విడుదలైన ‘గమన్’ చిత్రంతో నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ‘పరిం దా’, ‘ప్రహార్’, ‘అంగార్’, ‘క్రాంతివీర్’, ‘తిరంగా’, ‘ఖామోషి’, ‘అబ్ తక్ ఛప్పన్’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. గంభీరమైన పాత్రలైనా, భావోద్వేగ సన్నివేశాలైనా తనదైన శైలిలో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
వయసు పెరుగుతున్నప్పటికీ నానా పటేకర్ సినిమాల్లో నటించడం కొనసాగించారు. ఇటీవల అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేశ్ దేశ్‌ముఖ్ తదితరులు నటించిన ‘హౌస్‌ఫుల్ 5’లో కనిపించారు. అలాగే షాహిద్ కపూర్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓ రోమియో’లో పోలీసు అధికారిగా నటించారు. అనిల్ కపూర్, రాధికా మదన్ నటించిన ‘సుబేదార్’ చిత్రంలోనూ అతిథి పాత్రలో కనిపించారు. తన అసాధారణ నటనతో భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేసిన నానా పటేకర్ జ్ఞాపకాలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి.
తాజావార్తలు
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?