Ajith: బిల్లా రోజులని గుర్తు చేస్తున్న కోలీవుడ్ సూపర్ స్టార్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాని షేక్ చేసే పనిలో ఉన్నారు కోలీవుడ్ సూపర్ స్టార్ తల అజిత్ ఫ్యాన్స్. సూటు బూటు వేసుకున్న అజిత్ ఫోటోస్ బయటకి రావడంతో అజిత్ ఫ్యాన్స్ అలర్ట్ అయ్యి యాక్టివ్ మోడ్ లోకి వచ్చారు. ఈ ఫోటోస్ లో అజిత్… బిల్లా లుక్ ని గుర్తు చేస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు కంప్లీట్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లోకి వచ్చేసాడు అజిత్. స్టైల్ గా ఉండడమే కాకుండా అజిత్ స్లిమ్ అండ్ ఫిట్ గా ఉండడం విశేషం. గత కొన్నేళ్లుగా తన లుక్ విషయంలో పెద్దగా కేర్ తీసుకోకుండా సినిమాలు చేస్తూ ఉంటాడు. కనీసం హెయిర్ కి కలర్ కూడా వేయకుండా న్యాచురల్ గా స్క్రీన్ పైన కనిపించడం అజిత్ స్టైల్. ఫ్యాన్స్ మాత్రం అప్పుడప్పుడు అజిత్ ని కాస్త స్లిమ్ గా చూడాలి అనుకుంటూ ఉంటారు. యాంటీ ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో అజిత్ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇతర హీరోలు ఫిట్ గా ఉంటే సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉన్న అజిత్ మాత్రం అసలు ఫిట్నెస్ పైన దృష్టి పెట్టడు అంటూ కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. ఈ కామెంట్స్ కి బ్రేక్ వేసిన సినిమా వివేకం. శివ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ మూవీలో అజిత్ సిక్స్ ప్యాక్ తో కనిపించి కోలీవుడ్ మూవీ లవర్స్ కి ఆశ్చర్యపరిచాడు.
ఆ తర్వాత అజిత్ మళ్లీ తన రెగ్యులర్ ఫిజిక్ లోకి వచ్చేసి ఫిట్నెస్ ని వదిలేసాడు. అయితే మరోసారి అజిత్ ని స్లిమ్ అండ్ ఫిట్ గా చూడబోతున్నారు అనే మాటలు కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అజిత్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా విడ ముయార్చి ప్రస్తుతం అజర్‌బైజాన్ లో షూటింగ్ జరుపుకుంటుంది. మజిల్ తిరుమేణి డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ సినిమా కోసం అజిత్ లావు తగ్గాడు. అజర్‌బైజాన్ నుంచి అజిత్ కొత్త ఫోటోలు బయటకి వచ్చి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో అజిత్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. దీంతో అజిత్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లోకి వచ్చి ‘తల’, అజిత్, విడ ముయార్చి ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు. మే 1న విడ ముయార్చి సినిమా రిలీజ్ కానుంది, మరి ఈ మూవీతో అజిత్ ఎలాంటి హిట్ అందుకుంటాడు అనేది చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!