రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ సంబంధించిన ఖాళీలను అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. 3445 పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభించింది. త్వరలో దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) తన పాత రిక్రూట్‌మెంట్‌లలో ఒకదాన్ని పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ యొక్క 14298 పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మళ్లీ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. మార్చి-ఏప్రిల్ వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది. అయితే ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియను మళ్లీ ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది.
నకిలీ అంబులెన్స్ కేసులో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ గురువారం బారాబంకి ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో.. ముఖ్తార్ అన్సారీ కోర్టులో ఒక దరఖాస్తు ఇచ్చారు. జైల్లో తనకు స్లో పాయిజన్ ఇస్తున్నారని అన్సారీ ఈ దరఖాస్తులో ఆరోపించారు. ఇది తన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. కాగా.. తనకు వైద్యం చేసేందుకు వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని అన్సారీ కోర్టును అభ్యర్థించారు.
ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ -2 అభ్యర్థులకు ఊరట అందించే వార్త ఒకటి చెప్పింది ఏపీపీఎస్సీ. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువును మరో వారం రోజులు పొడిగించింది. ఈనెల 17 వరకు పొడిగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ(APPSC) అధికారులు తెలిపారు. గ్రూప్- 2 పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసే సమయంలో.. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ నిర్వహణ అధ్వానంగా ఉందని అభ్యర్థులు తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు రోజుల తరబడి ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు…
JEE Main 2024 Registration Last Date: జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ తొలి విడత దరఖాస్తు గడువును జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) పొడిగించింది. తొలి విడతకు దరఖాస్తు చేసే గడువును డిసెంబరు 4 (రాత్రి 9 గంటల) వరకు పొడిగించింది. ముందుగా ప్రకటించిన గడువు గురువారం (నవంబర్ 30) రాత్రితో ముగియగా.. దాన్ని డిసెంబరు 4వ తేదీ వరకు ఎన్‌టీఏ పొడిగించింది. ఇక సమర్పించిన దరఖాస్తుల్లో ఏవైనా తప్పిదాలు ఉంటే.. వెబ్‌సైట్‌లో డిసెంబరు…
మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులలో 6,7,8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం నిర్వహించిన ప్రవేశపరీక్షకు 87.4మంది విద్యార్థులు హాజరయ్యారని కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షలో ఆరో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసిన వారిలో 86.7 శాతం మంది, ఏడో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసిన వారిలో 89.8శాతం విద్యార్థులు, ఎనిమిదో తరగతి కోసం దరఖాస్తు చేసిన వారిలో 84.8 శాతం మంది…
గ్రూప్-1 దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తు చేసుకునే గడువును జూన్ 4 వరకు పొడిగిస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ మంగళవారం రాత్రి ప్రకటించింది. వాస్తవానికి మంగళవారం రాత్రితో గడువు ముగిసినప్పటికీ, అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు టీఎస్‌పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకొన్నది. ఫీజుల చెల్లింపు విషయంలో సమస్యలు తలెత్తినట్టు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఎవరూ నష్టపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో గడువును పొడిగిస్తున్నట్టు టీఎస్‌పీఎస్పీ వర్గాలు తెలిపాయి. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు…