Here is Reliance Jio Annual Packs: భారతదేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ ‘రిలయన్స్ జియో’ తాజాగా తమ మొబైల్ టారిఫ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. అంతేకాదు వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లను కూడా తగ్గించింది. గతంలో ఈ కేటగిరీలో పలు ప్లాన్‌లను ఇచ్చిన జియో.. వాటిని రెండుకు తగ్గించింది. రోజుకు 1.5జీబీ, 2జీబీ డేటా అందించే కేటగిరీలో వార్షిక ప్లాన్స్ లేకపోవడం గమనార్హం. జియో అందిస్తున్న ఆ రెండు వార్షిక ప్లాన్‌లు ఏంటి?, ప్రయోజనాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
Reliance Jio’s Rs 3999 Plan:
జియో అందిస్తున్న రూ.3,999 ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. ఇందులో అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎసెమ్మెస్‌లు, డైలీ 2.5జీబీ డేటాను పొందొచ్చు. ఫ్యాన్‌కోడ్, జియోసినిమా, జియోటీవీ, జియోక్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ ఈ ప్లాన్‌లో లభిస్తాయి. జియోసినిమా సబ్‌స్క్రిప్షన్‌లో ప్రీమియం కంటెంట్ ఉండదు. ఈ ప్లాన్ యొక్క అదనపు ప్రయోజనం ఏంటంటే.. అపరిమిత 5G డేటా.
Also Read: Motorola Edge 50 Neo: మోటోరోలా నుంచి మరో స్టన్నింగ్ స్మార్ట్‌ఫోన్.. ధర మాత్రం తక్కువే!
Reliance Jio’s Rs 3599 Plan:
జియో రూ.3,599 ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎసెమ్మెస్‌లు, డైలీ 2.5జీబీ డేటాను పొందొచ్చు. జియోసినిమా, జియోటీవీ, జియోక్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. జియోసినిమా సబ్‌స్క్రిప్షన్‌తో ప్రీమియం కంటెంట్ ఉండదు. అపరిమిత 5జీ డేటా మీకు లభిస్తుంది. ఈ ప్లాన్ సర్వీస్ వాలిడిటీ 365 రోజులు.