Motorola Edge 50 Neo Release Date in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘మోటోరొలా’ గత ఏడాది కాలంగా వరుసపెట్టి స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది. ముఖ్యంగా ఎడ్జ్ సిరీస్‌లో మోటోరొలా ఎడ్జ్ 40, మోటోరొలా ఎడ్జ్ 40 నియో, మోటోరొలా ఎడ్జ్ 50 అల్ట్రా, మోటోరొలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొచ్చిన కంపెనీ.. మరో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. ‘మోటోరోలా ఎడ్జ్ 50 నియో’ ఫోన్‌ను కంపెనీ భారత మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. ఎడ్జ్ 50 అల్ట్రా, ఎడ్జ్5o ప్రోకి కొనసాగింపుగా ఈ ఫోన్ వస్తోంది. ఎడ్జ్ 50 నియోకు సంబందించి లీకైన డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
Motorola Edge 50 Neo Price:
మోటోరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ గురించి వివరాలను 91మొబైల్స్ మరియు ప్రఖ్యాత టిప్‌స్టర్ సుధాన్షు అంభోర్ పంచుకున్నారు. మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను మోటోరోలా మధ్యతరగతి వారిని దృష్టిలో ఉంచుకుని తీసుకొస్తోంది. ఎడ్జ్ 50 నియో రెండు వేరియెంట్‌లలో అందుబాటులో ఉంటుందట. 8జీబీ+256జీబీ స్టోరేజ్, 12జీబీ+512జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు వేరియంట్ ధర రూ.23,999గా.. రూ.25,999గా ఉండనుంది. ఎడ్జ్ 40 నియో కూడా ఇదే ధరలో వచ్చిన విషయం తెలిసిందే.
Motorola Edge 50 Neo Specs:
మోటోరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్‌లో 6.55 ఇంచెస్‌తో కూడిన పీఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 144Hz రిఫ్రెష్ రేట్, 1300నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఈ స్క్రీన్ రానుంది. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉండనుంది. ఐపీ68 వాటర్ రెసిస్టెంట్‌ను ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ 6879 డైమెన్సిటీ 7030 ప్రాసెసర్‌ను ఇందులో ఇస్తున్నారట.
Motorola Edge 50 Neo Camera and Battery:
ఎడ్జ్ 50 నియో ఫోన్‌లో 50 మెగాపిక్సె, 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. బ్లూ, గ్రే, పోయిన్సియానా మరియు మిల్క్ రంగుల్లో ఈ ఫోన్ రానుంది.