5G spectrum auction: వారం పాటు సాగిన 5జీ స్పెక్ట్రం వేలం ముగిసింది. ఈ వేలంలో మొత్తంగా రూ.1,50,173 కోట్ల బిడ్లు దాఖలైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 10 కోట్ల కనెక్షన్లున్న యూపీ స్పెక్ట్రం దక్కించుకోవడానికి టెలికాం సంస్థలు పోటీ పడ్డాయి. ఈ బిడ్డింగ్‌లో రిలయన్స్ జియో టాప్ బిడ్డర్‌గా నిలిచింది. జియో రూ.80వేల 100కోట్లు, ఎయిర్టెల్ రూ.50వేల కోట్లు, ఐడియా వొడాఫోన్ రూ.15వేల కోట్లు, అదానీ గ్రూప్ రూ.500 కోట్లు-రూ.1000 కోట్ల బిడ్లు దాఖలు చేశాయి. మొత్తం బిడ్లలో ఒక్క జియో వాటానే 58.65శాతంగా నమోదైంది. దేశంలోనే తొలిసారిగా జూలై 26న 5జీ స్పెక్ట్రమ్ వేలం మొదలైంది. బిడ్డింగ్ కోసం 40రౌండ్లు జరిగాయి. బిడ్లు వేసిన వాటిల్లో.. 71శాతం 5జీ స్పెక్ట్రమ్ అమ్ముడుపోయింది.
Read Also: Parliament: పార్లమెంట్లో పచ్చి వంకాయ కొరికిన ఎంపీ.. అసలు ఏం జరిగిందంటే..?
ప్రస్తుతం 600 ఎంహెచ్‌జెడ్, 700 ఎంహెచ్‌జెడ్, 800ఎంహెచ్‌జెడ్, 900 ఎంహెచ్‌జెడ్, 1800 ఎంహెచ్‌జెడ్, 2100 ఎంహెచ్‌జెడ్, 2300 ఎంహెచ్‌జెడ్, 2500 ఎంహెచ్‌జెడ్, 3300 ఎంహెచ్‌జెడ్, 26 జీహెచ్‌జెడ్ బ్యాండ్‌విడ్త్‌లను వేలంలో ఉంచారు. ఆగస్టు 15 కల్లా మొత్తం బిడ్డింగ్ ప్రక్రియను ముగించి.. దేశంలోని ప్రధాన నగరాల్లో 5G సేవలను ఈ సెప్టెంబర్ నాటికి అందించాలని కేంద్రం భావిస్తోంది. ఈ వేలంలో విజయవంతమైన బిడ్డర్లు 20 ఏళ్ల పాటు ఆ మొత్తాన్ని 20 వార్షిక వాయిదాల్లో చెల్లించవచ్చు. ఇప్పటికే ట్రాయ్ పలు చోట్ల పైలట్ ప్రాజెక్టుగా 5జీని ప్రారంభించింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్, బెంగళూరు మెట్రో, కాండ్లా పోర్ట్, భోపాల్‌లోని 11ప్రదేశాల్లో 5జీ సేవలను జియో, ఎయిర్టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ సహకారంతో పైలట్ ప్రాజెక్టుగా ట్రాయ్ అందిస్తోంది.