5G spectrum auction: వారం పాటు సాగిన 5జీ స్పెక్ట్రం వేలం ముగిసింది. ఈ వేలంలో మొత్తంగా రూ.1,50,173 కోట్ల బిడ్లు దాఖలైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 10 కోట్ల కనెక్షన్‌లున్న యూపీ స్పెక్ట్రం దక్కించుకోవడానికి టెలికాం సంస్థలు పోటీ పడ్డాయి. ఈ బిడ్డింగ్‌లో రిలయన్స్ జియో టాప్ బిడ్డర్‌గా నిలిచింది. జియో రూ.80వేల 100కోట్లు, ఎయిర్‌టెల్ రూ.50వేల కోట్లు, ఐడియా వొడాఫోన్ రూ.15వేల కోట్లు, అదానీ గ్రూప్ రూ.500 కోట్లు-రూ.1000 కోట్ల బిడ్లు దాఖలు చేశాయి.…
5జీ స్పెక్ట్రమ్ వేలంలో గురువారం మూడో రోజు ముగిసే సమయానికి ప్రభుత్వానికి 1,49,623 కోట్ల రూపాయల విలువైన బిడ్‌లు వచ్చాయి. కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం.. వేలం మూడో రోజు ముగిసే వరకు 16 రౌండ్ల బిడ్డింగ్‌లు పూర్తయ్యాయి. శుక్రవారం నాలుగో రోజు వేలం కొనసాగనుంది.
కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు, సంస్థలకు 5జీ సేవలను అందించడానికి విజయవంతమైన బిడ్డర్లకు స్పెక్ట్రమ్‌ను కేటాయించే స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించే ప్రతిపాదనను బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీని ప్రకారం 20 సంవత్సరాల చెల్లుబాటు వ్యవధితో మొత్తం 72097.85 MHz స్పెక్ట్రమ్ జులై 2022 చివరి నాటికి వేలం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ 5G సేవలు అందుబాటులోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని.. అలాగే…