Redmi Note 13 Pro 5G Olive Green Color Variant Launched: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షావోమి ‘రెడ్‌మీ’ బ్రాండ్‌లో నోట్ 13 5జీ సిరీస్‌ను భారత మార్కెట్‌లో రిలీజ్ చేసింది. 2023 సెప్టెంబర్‌లో చైనాలో రిలీజ్ అయిన ఈ సిరీస్.. 2024 జనవరిలో భారత్‌లో విడుదలైంది. 13 సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 13 స్టాండర్డ్, రెడ్‌మీ నోట్ 13 ప్రో, రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ వేరియంట్‌లను కంపెనీ రిలీజ్ చేసింది. రెడ్‌మీ నోట్ 13 ప్రోలో కంపెనీ తాజాగా సరికొత్త కలర్ వేరియంట్‌ను తీసుకొచ్చింది.
ఆలివ్ గ్రీన్ కలర్ వేరియంట్‌లో రెడ్‌మీ నోట్ 13 ప్రోను రిలీజ్ చేసింది. ఇది డ్యూయల్ టోన్ లుక్‌ని కలిగి ఉంది. ఫోన్ లాంచింగ్ సమయంలో అరోరా పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్, ఓషన్ టీల్ కలర్స్‌లో వచ్చింది. తాజాగా ఆలీవ్ గ్రీన్ కలర్‌లో లాంచ్ అయింది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త కలర్ ఫోన్.. త్వరలోనే భారత మార్కెట్‌లోకి రానుంది. ఇందులో కోర్ స్పెసిఫికేషన్‌లు ఇతర వేరియంట్‌ల మాదిరిగానే ఉంటాయి.
Also Read: Bugatti Car Price: గంటకు 445 కిలోమీటర్ల వేగం.. బుగాటి కారు ధర ఎంతో తెలుసా?
రెడ్‌మీ నోట్ 13 ప్రో ఆలివ్ గ్రీన్ కలర్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.24,999 కాగా.. 8జీబీ+256జీబీ స్టోరేజ్ ధర రూ.26,999గా ఉంది. ఇక 12జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.28,999గా కంపెనీ నిర్ణయించింది. ఇందులో 6.67 ఇంచెస్‌తో అమోలెడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లే ఉంటుంది. 1.5K రిజల్యూషన్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్, ఎంఐయూఐ 14 ఓఎస్‌ను ఇందులో అందించారు. 200 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా వెనకాల ఉండగా.. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఇచ్చారు. నోట్ 13 ప్రోలో 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.