Redmi 13C to Release in India on December 6: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘షావోమి’ సబ్ బ్రాండ్ రెడ్‌మీ.. ఈ నవంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా ‘రెడ్‌మీ 13సీ’ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఇప్పటికే చైనాలో ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉండగా.. భారత మార్కెట్‌లోకి డిసెంబర్ 6న రానుంది. అందుబాటులో ధరలో అత్యుత్తమ ఫీచర్లతో ఈ ఫోన్‌ను రిలీజ్ చేసినట్లు రెడ్‌మీ తెలిపింది. డిసెంబర్ 2022లో వచ్చిన రెడ్‌మీ 12సీకి ఇది అప్డేటెడ్ వెర్షన్. ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్స్ లీక్ అయ్యాయి. అవేంటో ఓసారి చూద్దాం.
Redmi 13C Camera:
రెడ్‌మీ 13సీలో 6.74 హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు ఆక్సిలరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఇందులో 8ఎంపీ ఫ్రెంట్ కెమెరా ఉంటుంది.
Redmi 13C Battery:
ఆండ్రాయిడ్ 13 ఆధారంగా (MIUI 14) రెడ్‌మీ 13సీ రన్ అవుతుంది. హీలియో జీ85 ప్రాసెసర్ ఉంటుంది. ఈ వేరియంట్ 18 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ వేరియంట్ క్లోవర్ గ్రీన్, గ్లేసియర్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్ మరియు నేవీ బ్లూ కలర్‌లలో అందుబాటులో ఉంటుంది.
Also Read: Rinku Singh: చివరి 5 ఓవర్లలోనే నా పని.. ఫినిషింగ్ స్కిల్స్‌పై దృష్టి పెట్టా!
Redmi 13C Price:
రెడ్‌మీ 13సీ ఫోన్ 4GB + 128GB వేరియంట్ ధర $139.99 (దాదాపు రూ. 11,700) ఉండగా.. 6GB + 128GB మరియు 8GB + 256GB వేరియంట్లు వరుసగా $159.99 (దాదాపు రూ. 13,300) మరియు $164.90 (సుమారుగా రూ. 13,800)గా ఉంటుంది.