Likhitha Reddy: ప్రశాంత్ నీల్ భార్య కూడా ఎన్టీఆర్ ఫ్యానేనా? థియేటర్ లో ఆ రచ్చ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Likhitha Reddy: టాలీవుడ్ యాక్షన్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన నటనకు, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీకి, ఆయన డ్యాన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్నారు. తాజాగా మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ప్రముఖ ‘విమల్ థియేటర్’ లో ఫ్యాన్స్ చేసిన రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
థియేటర్‌ను ఊపేసిన ‘లిఖితా రెడ్డి’ వైల్డ్ ఎనర్జీ
ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా థియేటర్ లోపల జరిగిన సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భార్య ‘లిఖితా రెడ్డి’ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ వీడియోలో ఆమె ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు చేతులు పైకెత్తి, పూనకంతో “ఎన్టీఆర్.. ఎన్టీఆర్” అంటూ నినదించిన తీరు థియేటర్‌ను దద్దరిల్లేలా చేసింది. చుట్టూ ఉన్న వందలాది మంది అభిమానులు సైతం తమ మొబైల్ ఫ్లాష్‌లైట్స్ ఆన్ చేసి ఫోన్లు పైకెత్తడంతో థియేటర్ మొత్తం ఊగిపోయింది. ఈ వైరల్ వీడియో ఇప్పటికే లక్షలాది వ్యూస్, వేలాది షేర్లతో దూసుకుపోతోంది. ఎన్టీఆర్‌తో ఫ్యాన్స్‌కు ఉండే ఎమోషనల్ బాండింగ్‌కు ఈ వీడియోనే అసలైన నిదర్శనమని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో కనిపించిన లిఖితా రెడ్డి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భార్య. ఆయన డైరెక్షన్లోనే ప్రస్తుతం యంగ్ టైగర్ హీరోగా నటిస్తున్నారు. దానికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ సందర్భంగానే ఈ సంఘటన చోటుచేసుకుంది.
Also Read
ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ లో #HappyBirthdayNTR తో పాటు ఆయన రాబోయే మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ #Dragon హ్యాష్‌ట్యాగ్‌లు టాప్ ట్రెండింగ్‌లో నిలిచాయి. ఎన్టీఆర్ పుట్టినరోజును అభిమానులు ఒక పండుగలా, ఉత్సవంలా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ‘డ్రాగన్’ (#Dragon) సినిమాపై ఈ రేంజ్ హైప్ చూస్తుంటే, సినిమా రిలీజ్ రోజున థియేటర్లు బద్దలైపోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Jai NTR ✊🏻🔥
Likitha Reddy Garu enjoying the electrifying vibes with our co-fans at Vimal Theatre 💥❤️.@tarak9999 #HappyBirthdayNTR #Dragon pic.twitter.com/F2mIFH8ci1
— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) May 19, 2026
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!