Hyderabad : హైదరాబాద్ లో పెరిగిన కూరగాయల ధరలు.. సామాన్యుల జేబులకు చిల్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొన్నటివరకు కాస్త తక్కువగా ఉన్న కూరగాయల ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. నగరంలో నిన్న చికెన్ ధరలు కొండేక్కాయి.. నేడు కూరగాయల ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.. ఈ పెరిగిన ధరలు సామాన్యులకు గుండెపోటును తెప్పిస్తున్నాయి.. గతంలో బజారుకు 200 రూపాయలను తీసుకువెళ్తేనే సంచి నిండా కూరగాయలు వచ్చేవి… కానీ ఇప్పుడు రెండు రకాలు కూడా రావడం లేదని జనాలు వాపోతున్నారు..
గత సోమవారం వరకు కార్తీక వారాలు కాబట్టి ధరలు భారీగా తగ్గాయి.. అందులో చికెన్ ధరలు వందకు పడిపోయాయి.. దీంతో కూరగాయ ధరలకు రెక్కలు వచ్చాయి. దానితోపాటు చలికాలం కావడంతో పంట దిగుబడి తక్కువగా ఉండడం, పంట చేతికి సరిగా అందకపోవడంతో అమాంతం ధరలు పెరిగిపోయాయి.. ప్రస్తుతం బీన్స్ ధరలు రూ. 50 ఉండగా, చిక్కుడు కాయల ధరలు మాత్రం రూ. 65 దగ్గర ఉన్నాయి.. అదే విధంగా దొండకాయలు 50 రూపాయలు, బెండకాయలు 60 రూపాయలు, అతి తక్కువగా అంటే టమాటో ధర కిలో 25 రూపాయలు ధర పలుకుతోంది..
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
అంతేకాదు ఉల్లి, వెల్లుల్లితో పాటుగా అల్లం, ఆకుకూరల ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి.. హోల్‌సేల్ లో కిలో వెల్లుల్లిపై ధర 240 పలుకుతోంది ఇక పావు కిలో అల్లం ధర 40 రూపాయలు ఉండగా కిలో అల్లం ధర 150 రూపాయలకు పైనే ఉంది అంటూ వ్యాపారాలు చెప్తున్నారు.. మొన్న కురిసిన వర్షాలకు పంట లేకపోవడం.. నాణ్యత లేకపోవడం, కొత్త పంట రాకపోవడంతో ధరలు భారీగా పెరిగినట్లు వ్యాపారస్తులు తెలుపుతున్నారు.. కాయ కష్టం చేసుకొని నోటికి రుచిగా తినడానికి లేకుండా పోయింది సామాన్యులకు..
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!