ఐపీఎల్ వేలం చరిత్రలో కొంత మంది ఆటగాళ్లు కోట్లు కొల్లగొట్టారు. గత వేలం కంటే.. ఈసారి వేలంలో రికార్డులు బద్దలైంది. ఐపీఎల్‌లో ఇండియన్ బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తుండటంతో.. తాజాగా జరిగిన మెగా వేలంలో భారత్ ఆటగాళ్లు రికార్డు ధర పలికారు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఈ ఆటగాడిని రూ.24 కోట్ల 75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే వేలంపాటలో ఈ ఆటగాడిని దక్కించుకునేందుకు చివరి వరకు కోల్‌కతాతో పాటు గుజరాత్ టైటాన్స్ ప్రయత్నం చేసింది. కానీ చివరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. అంతకుముందు.. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 20.50 కోట్ల భారీ ధర పలికాడు. ఇప్పుడు ఆ ధరను స్టార్క్…