స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
- మే 22న భారత మార్కెట్లో లాంచ్ కానున్న Realme 16T 5G
- Realme 15Tకు సక్సెసర్‌గా కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల
- భారీ 8000mAh బ్యాటరీ ప్రధాన ఆకర్షణ
- ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme 16T 5G Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ ను తీసుకురానుంది రియల్మీ (Realme). గత ఏడాది విడుదలైన Realme 15Tకు సక్సెసర్‌గా Realme 16T 5Gను భారత మార్కెట్లో మే 22న అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. భారీ బ్యాటరీ, దీర్ఘకాల బ్యాటరీ లైఫ్, కొత్త పవర్ మేనేజ్మెంట్ టెక్నాలజీలతో ఈ ఫోన్‌ను హై ఎండ్యూరెన్స్ స్మార్ట్‌ఫోన్ గా రియల్మీ ప్రమోట్ చేస్తోంది.
Realme 16T 5Gలో అత్యంత ప్రత్యేకమైన ఫీచర్ గా భారీ బ్యాటరీ 8000mAh అని చెప్పాలి. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ ఒక్కసారి పూర్తి చార్జ్ చేస్తే మూడు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందించే సామర్థ్యం కలిగి ఉంది. రియల్మీ అంతర్గత DOU V3.0 హెవీ యూజేజ్ టెస్టింగ్ ఆధారంగా ఈ వివరాలు వెల్లడించింది. దీనిలో ఎక్కువసేపు వీడియో స్ట్రీమింగ్, ట్రావెల్ సమయంలో నావిగేషన్, లాంగ్ గేమింగ్ సెషన్స్ వంటి అధిక పవర్ వినియోగ అవసరాలు ఉన్న యూజర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ముఖ్యంగా BGMI గేమ్‌ను 60FPS స్థిర పనితీరుతో వరుసగా 11 గంటల పాటు ఆడవచ్చని రియల్మీ పేర్కొంది.
Also Read
- 600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
- Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్‌లో మెసేజ్ పంపొచ్చు!
- Moto G37 Power, Moto G37: మోటో జి37 పవర్, మోటో జి37 రిలీజ్ డేట్ ఫిక్స్.. డైమెన్సిటీ 6400, 7,000mAh భారీ బ్యాటరీ
- 200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
భారీ బ్యాటరీతో పాటు realme 16T 5Gలో “7-ఏళ్ల బాటరీ హెల్త్” టెక్నాలజీని కూడా అందిస్తోంది. ప్రత్యేక బ్యాటరీ మేనేజ్మెంట్ అల్గారిథమ్‌ల సహాయంతో బ్యాటరీ సామర్థ్యం త్వరగా తగ్గిపోకుండా ఈ టెక్నాలజీ పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తోంది. వీటితో పాటు అన్ని పరిస్థితులలో బైపాస్ ఛార్జింగ్, అధునాతన ఉష్ణోగ్రత రక్షణ, ఓవర్‌ఛార్జ్ రక్షణ వంటి పవర్ మేనేజ్మెంట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని వల్ల ఎక్కువసేపు ఉపయోగించినా ఫోన్ వేడి తగ్గి, ఛార్జింగ్ స్థిరంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ మొబైల్ కేవలం 8.88mm మందంతో స్లిమ్ ప్రొఫైల్‌ను కలిగి ఉంది. ఇందులో 6.8 అంగుళాల ఫ్లాట్ డిస్ప్లేను అందిస్తున్నారు. ఫోన్ మిడ్ ఫ్రేమ్‌కు మెటాలిక్ ఫినిష్ ఇవ్వగా, కెమెరా మాడ్యూల్‌ను అల్యూమినియం అల్లాయ్‌తో రూపొందించారు. ఫోన్ వెనుక భాగంలో “Gleaming Wings” గ్రేడియంట్ టెక్స్చర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మల్టీ కలర్ పార్టికల్స్‌తో రూపొందించిన ఈ డిజైన్‌లో సిల్వర్, గ్రీన్, గ్లిట్టర్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. ఈ మొబైల్ అరోరా ఆకుపచ్చ, స్టార్ లైట్ ఎరుపు, స్టార్ లైట్ నలుపు అనే మూడు కలర్ వేరియంట్లలో లభించనుంది. మే 22న అధికారిక లాంచ్ తర్వాత ఫ్లిప్‌కార్ట్, రియల్మీ అధికారిక వెబ్సైట్, ప్రధాన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలను లాంచ్ ఈవెంట్లో కంపెనీ ప్రకటించనుంది.
తాజావార్తలు
-
KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్‌కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
-
MS Dhoni: బిగ్ అప్డేట్.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కి ధోనీ ఎంట్రీ..
-
Jihadi drug: భారత్‌లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
-
Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
-
Peddi: పెద్ది సినిమాలో విక్కీ కౌశల్ తండ్రి?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..