Jihadi drug: భారత్‌లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
- భారత్‌లో తొలిసారి పట్టుబడిన ‘‘జిహాదీ డ్రగ్’’..
- మిడిల్ ఈస్ట్‌కు తరలిస్తున్నట్లు గుర్తింపు..
- ‘‘పేదవాడి కొకైన్’’గా పేర్కొన్న ఈ డ్రగ్‌తో తీవ్ర పరిణామాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jihadi drug: భారతదేశంలో తొలిసారిగా ప్రమాదకరమైన ‘‘జిహాదీ డ్రగ్’’ పట్టుబడింది. పేదవాడి కొకైన్‌గా కూడా పిలిచే ‘‘క్యాప్టాగన్’’ భారీగా పట్టుబడటంతో ఒక్కసారిగా భద్రతా ఏజెన్సీలు అలర్ట్ అయ్యాయి. గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్, ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో నార్కటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) నిర్వహించిన ‘‘ఆపరేషన్ రేజ్‌పిల్’’లో రూ. 182 కోట్ల విలువైన క్యాప్టాగన్ ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. సిరియా దేశానికి చెందిన ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఈ డ్రగ్ గల్ఫ్ దేశాలకు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఇలా పట్టుబడిన డ్రగ్ పై అధికారులు విచారణ ప్రారంభించారు.
Read Also: Thailand Train Crash: బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
క్యాప్టాగన్‌ను సాధారణంగా ‘‘జిహాదీ డ్రగ్’’, ‘‘పూర్ మ్యాన్స్ కొకైన్’’గా పిలుస్తారు. అతి తక్కువ ధరకు లభించడం దీని ప్రత్యేకం. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో, యుద్ధ ప్రాంతాల్లో ఈ డ్రగ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సిరియా అంతర్యుద్ధ సమయంలో ఐసిస్ ఉగ్రవాదులు దీనిని పెద్ద ఎత్తున ఉపయోగించారు. దీన్ని తీసుకుంటే చాలా గంటలు నిద్ర లేకుండా ఉండటం, భయం, అలసట లేకుండా ఉండటం వంటి ప్రభావాలను కలిగిస్తుంది. అందువల్లనే దీనిని ‘‘జిహాదీ డ్రగ్’’గా పిలుస్తారు.
నిజానికి 1960లలో దృష్టి లోపం, నార్కోలెప్సీ ఉన్న రోగులకు ఈ మందును చికిత్సలో ఉపయోగించేవారు. అసలు ఇది డ్రగ్ కాదు. దీని అసలు రూపం ‘‘ఫెనెథైలిన్’’. దీని ద్వారా వచ్చే మత్తు అలవాటుగా మారుతుందని అనేక దేశాలు దీనిని నిషేధించాయి. ప్రస్తుతం బ్లాక్ మార్కెట్లో మాత్రమే క్యాప్టాగన్ దొరుకుతుంది. రహస్యంగా ఈ డ్రగ్‌లో యాంఫెటమైన్, మెతాంఫెటమైన్, కాఫీన్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతున్నారు. ఈ డ్రగ్‌ను తీసుకుంటే కొంత సేపు ఉత్సాహంగా ఉన్నా, దీర్ఘకాలంలో తీవ్రమైన మానసిక సమస్యలు, హింసాత్మక ప్రవర్తన వంటి దుష్ప్రభవాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తు్నారు.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!