Peddi: పెద్ది సినిమాలో విక్కీ కౌశల్ తండ్రి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ఇండస్ట్రీలో మాస్ ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లకు ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా ఆ యాక్షన్ వెనుక ఒక బలమైన ఎమోషన్, మునుపెన్నడూ చూడని కొత్తదనం ఉంటే ప్రేక్షకులు థియేటర్లలో పూనకాలతో ఊగిపోతారు. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఒక హై-వోల్టేజ్ యాక్షన్ విందును అందించడానికి సిద్ధమవుతోంది ‘పెద్ది’ చిత్రం. ఈ సినిమాలోని ఫైట్ మాస్టర్ నభకాంత్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సినిమాలోని యాక్షన్ బ్లాక్స్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించిన నభకాంత్.. టాలీవుడ్ లెజెండరీ ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్‌లను తన గురువులుగా పేర్కొన్నారు. ఈ సినిమాలో కేవలం రొటీన్ ఫైట్లే కాకుండా, నేషనల్ లెవెల్ (జాతీయ స్థాయి) కుస్తీ పోటీల నేపథ్యంలో సాగే సరికొత్త యాక్షన్ డ్రామా ఉండబోతోంది. ఇందులోని రెజ్లింగ్ సీక్వెన్స్ అత్యంత సహజంగా, రియలిస్టిక్‌గా రావాలని చిత్ర యూనిట్ గట్టిగా ఫిక్స్ అయింది.
Also Read
- Scene Movie: "హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది": సూర్య
- Dada: రక్తపాతం లేని రచ్చ.. బాలయ్య వర్సెస్ మనోజ్ ‘దాదా’ వార్!
- Sivakarthikeyan: డైరెక్టర్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన హీరో.. సర్ప్రైజ్ మామూలుగా లేదుగా!
- Tollywood: ఒకే ఒక్క ఫ్లాప్.. ప్రశ్నార్థకంగా మారిన స్టార్ డైరెక్టర్ల భవిష్యత్తు!
కుస్తీ సీన్ల కోసం బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ తండ్రి, ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ శ్యామ్ కౌశల్‌ను రంగంలోకి దించారు. నేషనల్ లెవెల్ రెజ్లింగ్ మ్యాచ్‌లను తలపించేలా ఈ సీక్వెన్స్‌లను ఎక్కడా సినిమాటిక్‌గా అనిపించకుండా, చాలా నాచురల్‌గా డిజైన్ చేశారు. సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలిచేలా ఒక భారీ మాస్ రెజ్లింగ్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేసినట్లు నభకాంత్ వెల్లడించారు. ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటివరకు ప్రేక్షకులు ఇలాంటి రస్టిక్ అండ్ మాస్ కుస్తీ ఫైట్‌ను చూసి ఉండరని ఆయన స్పష్టం చేశారు. అయితే, స్క్రీన్‌పై చూసేటప్పుడు ఈ సీక్వెన్స్ ఎంత అద్భుతంగా ఉంటుందో, దానిని షూట్ చేయడం అంతకంటే వంద రెట్లు సవాలుతో కూడుకున్నదని, ఒకానొక రెజ్లింగ్ ఎపిసోడ్‌ను తెరకెక్కించడానికి యాక్షన్ టీమ్ మొత్తం ప్రాణం పెట్టి పనిచేసిందని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Forbes Billionaires List: ఆసియాలో ధనవంతుల జాబితా విడుదల.. ప్రపంచ కుబేరుల్లో భారీ మార్పులు..!
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Layoffs: లేఆఫ్స్ బాటలో డిస్నీ.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ పోటీ తట్టుకోలేక కీలక నిర్ణయం..
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
ట్రెండింగ్
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
-
Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!