RBI: ఇప్పటికీ రూ.7000 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ప్రజల వద్దే ఉన్నాయ్..
- ఈ కరెన్సీ నోట్లు గత ఏడాది మే నెలలో చెలామణి నుంచి తొలగించన ఆర్బీఐ
- ఇంకా ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న 100 శాతం నోట్లు తిరిగి రాలేదని స్పష్టం
- 2.13% పింక్ నోట్లు ప్రజల వద్ద ఉన్నాయని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో చెలామణి నుండి తొలగించబడిన రూ. 2000 (రూ. 2000 నోటు) పింక్ నోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక పెద్ద అప్డేట్ ఇచ్చింది. ఈ కరెన్సీ నోట్లు గత ఏడాది మే నెలలో చెలామణి నుంచి తొలగించినా.. ఇంకా ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న 100 శాతం నోట్లు తిరిగి రాలేదని తెలిపింది. జూలై 1, 2024న దీనికి సంబంధించిన వివరాలను పంచుకుంటూ.. దేశంలో ఇప్పటికీ రూ.7000 కోట్ల కంటే ఎక్కువ విలువైన రూ.2000 నోట్లను ప్రజలు కలిగి ఉన్నారని ఆర్బీఐ పేర్కొంది. మార్కెట్లో కేవలం 1% నోట్లు మాత్రమే బ్యాంకింగ్ ప్రక్రియకు తిరిగి వచ్చాయి. అయితే 2.13% పింక్ నోట్లు ప్రజల వద్ద ఉన్నాయి. రెండు శాతానికి పైగా ఉన్న ఈ నోట్ల విలువ రూ.7,581 కోట్లు ఉంటుంది.
READ MORE: Akhil – Agent : టీవీ ప్రీమియర్ కి రెడీ అయిపోయిన అఖిల్ “ఏజెంట్”.. కాకపోతే..
Also Read
- Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్‌గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
- ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
- Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
- Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
గత సంవత్సరం, మే 19, 2023న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. మార్కెట్లో రూ. 3.56 లక్షల కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు ఉండగా.. డిసెంబర్ 29, 2023న, ఈ సంఖ్య కేవలం రూ.9,330 కోట్లకు తగ్గింది. దీని తర్వాత.. నోట్ల ఉపసంహరణ వేగం కొంత మందగించింది. రూ. 7,581 కోట్ల విలువైన నోట్లు తిరిగి రావాల్సి ఉంది. క్లీన్ నోట్ పాలసీ కింద 19 మే 2023న దేశంలో చెలామణిలో ఉన్న అత్యధిక విలువైన రూ. 2000 నోటును ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. దీని తర్వాత, స్థానిక బ్యాంకులు, 19 RBI ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ నోట్లను మార్పిడి చేసుకోవడానికి సెంట్రల్ బ్యాంక్ 23 మే నుంచి 30 సెప్టెంబర్ 2023 వరకు సమయం ఇచ్చింది. అయితే, దీని తర్వాత ఈ గడువు నిరంతరంగా పొడిగించబడుతూనే ఉంది. అయితే ఈ నోట్లను ఇప్పటికీ మార్చుకోవచ్చు. అయితే ఇది స్థానిక బ్యాంకుల్లో సాధ్యం కాదు. చెలామణిలో లేని ఈ పింక్ నోట్లను అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నోలోని 19 ఆర్బీఐ కార్యాలయాల్లో డిపాజిట్ చేస్తామని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా మరియు తిరువనంతపురం వెళ్లడమే కాకుండా, ప్రజలు ఈ నోట్లను తమకు సమీపంలోని ఏదైనా పోస్టాఫీసు ద్వారా ఇండియా పోస్ట్ ద్వారా డిపాజిట్ చేయవచ్చు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్‌గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
-
Rishab Shetty: రామాయణ ట్రైలర్‌కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
-
Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్‌కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!