వేసవిలో వేడి మాత్రమే కాదు.. నో్రూరించే మామిడి పండ్లు.. వేడిని తగ్గించే పుచ్చకాయలు, దోసకాయలు, తాటిముంజలు కూడా ఎక్కువ వస్తాయి.. అయితే పచ్చి మామిడి కాయలను తినడం వల్ల వేడి గుల్లలు వస్తాయని అనుకుంటారు. కానీ మామిడి కాయలతో తయారు చేసే జ్యూస్ వల్ల వేడి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎలా తయారు చేసుకోవాలి.. ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పచ్చిమామిడిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. షుగర్ ఉన్నవారు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు.. మాములుగా పచ్చిమామిడిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పండిన మామిడి కంటే ఈ పచ్చి మామిడిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం వంటి మూలకాలు ఉన్నాయి.. అంతేకాదు గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను కూడా మామిడి దూరం చేస్తుంది.. ఈ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
ముందుగా మామిడి కాయలను శుభ్రంగా కడిగి, చెక్కు తీసి పెట్టుకోవాలి.. అల్లం, పచ్చిమామిడి, పచ్చిమిర్చి, పుదీనా వేసి మిక్సీ పట్టండి. తర్వాత ఇందులో నీరు పోయండి. చివరగా దానిని రుచికి తగ్గట్లు ఉప్పు, కొంచెం పంచదార, కొద్దిగా నిమ్మరసం పిండి, పుదీనా ఆకులను వేసి గార్నిష్ చేసుకొని కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి తాగితే చాలు.. వేడి త్వరగా తగ్గుతుంది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.