Ravichandran Ashwin: పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితిపై రవిచంద్రన్ అశ్విన్ ఆందోళన
- పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితిపై.
- టీమిండియా ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఆందోళన.
- దాదాపు 1000 రోజులుగా మ్యాచ్ గెలవలేదంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravichandran Ashwin: ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ జట్టు కష్టకాలంలో ఉంది. ఆసియా కప్ 2023 నుంచి జట్టు ఒక్కో విజయం కోసం తెగ పోరాడుతుంది. 2023 ప్రపంచ కప్‌లో జట్టు సెమీ-ఫైనల్‌కు చేరుకోకపోవడం, ఇక 2024 T20 ప్రపంచ కప్‌లో మొదటి రౌండ్ నుండి నిష్క్రమన., ఇప్పుడు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో ఓటమి, కెప్టెన్సీని తరచూ మార్చడం వంటి కారణాలతో జట్టులో అస్థిరత వాతావరణం నెలకొంది. ఈ విషయంపై తాజాగా భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆందోళన వ్యక్తం చేశాడు.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు
Also Read
- Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆతహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్..
- UP: 2047 వరకు అఖిలేష్ కుటుంబంలో ఎవరూ ముఖ్యమంత్రి అవ్వరు.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
- Vivo S2 FE: 10,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP68 + IP69 రేటింగ్.. వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్..
- Chandigarh University: ఫ్రెషర్స్ వేడుకలో అసభ్యకర డ్యాన్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
2023 వన్డే ప్రపంచకప్ తర్వాత బాబర్ ఆజం జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌కు ముందు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇప్పుడు మరోసారి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ పరాజయాలు పాకిస్థాన్ అభిమానులను నిరాశపరిచాయి. అలాగే పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో అంతర్గత కలహాలు కూడా ఉన్నాయి. కెప్టెన్సీలో తరచూ మార్పులు చేయడం వల్ల జట్టులో గందరగోళం ఏర్పడిందని, ఆటగాళ్లు జట్టు విజయం కంటే తమ వ్యక్తిగత ఆటలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని భారత జట్టు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
MLA Peddireddy: పుంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన
ఈ విషయంపై అశ్విన్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ క్రికెట్ ప్రస్తుత పరిస్థితి, వారు ఎదుర్కొంటున్న దశను చూస్తుంటే నేను చాలా బాధగా ఉన్నానని తెలిపాడు. చాలా మంది అనుభవజ్ఞులైన క్రికెటర్లు పాకిస్థాన్ తరపున ఆడారు. పాకిస్థాన్ చాలా మంచి జట్టు. క్రికెటర్ల కోణంలో చూస్తే.. క్రికెట్ ఆడేందుకు గర్వపడే దేశం. తరచుగా సారథులను మార్చడం వల్ల అక్కడ అయోమయం నెలకొందన్నాడు. ఇప్పటి నుంచైనా ప్లేయర్లు వ్యక్తిగత ప్రదర్శన పై దృష్టి సారించాలని అశ్విన్ అన్నాడు. ఇంకా చెప్పాలంటే పాకిస్థాన్ దేశ క్రికెట్ ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నాడు. ఇక టీం పరిస్థితి చూస్తుంటే జాలివేస్తోందని., ఒకవేళ అక్కడ నైపుణ్య ఆటగాళ్లకు ఏదైనా కొదవ ఉందా అంటే అలాంటింది ఏం లేదని., చాలా మంచి ప్లేయర్లు అందుబాటులో ఉన్నారని తెలిపాడు. కాకపోతే.. వారి క్రికెట్ బోర్డులో చోటు చేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో ఆ జట్టు పతనావస్థకు చేరుకుందని., ముఖ్యంగా కుర్చీలాటతో మరింత దిగజారుతోందని అంటూ.. ఆ జట్టు దాదాపు 1000 రోజులుగా మ్యాచ్ గెలవలేదంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అశ్విన్ మాట్లాడాడు.
తాజావార్తలు
-
Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆతహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్..
-
UP: 2047 వరకు అఖిలేష్ కుటుంబంలో ఎవరూ ముఖ్యమంత్రి అవ్వరు.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
-
The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
-
Vivo S2 FE: 10,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP68 + IP69 రేటింగ్.. వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్..
-
Chandigarh University: ఫ్రెషర్స్ వేడుకలో అసభ్యకర డ్యాన్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!