Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదైంది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను మధురైలోని కమిషనరేట్ లో వాంజినాధన్ అనే లాయర్ కంప్లైంట్ ఇచ్చాడు. సనాతన ధర్మం పై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను పవన్ వక్రీకరించారని ఫిర్యాదులో తెలిపారు. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై గతేడాది సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం చేసిన సంగతి తెలిసిందే. సనాతన నిర్మూలన సభలో ముఖ్య అతిథిగా హాజరైన స్టాలిన్ మాట్లాడుతూ.. మనం డెంగీను, దోమలను, మలేరియాను లేదా కరోనాను వ్యతిరేకించలేం. వాటిని నిర్మూలించాల్సిందే. అలాగే సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలంటూ ఉదయనిధి కీలక వ్యాఖ్యలు చెప్పారు. సనాతన అంటే సంస్కృతం నుంచి వచ్చిందని, ఇది సాంఘిక న్యాయం, సమానత్వాలకు, మహిళా సాధికారతకు వ్యతిరేకమని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. అయితే ఈ మాటలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకగా, బీజేపీ నాయకులు అప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also:Ponguleti Srinivas Reddy: రైతన్నకు భూమీ విషయంలో భయం లేకుండా చేస్తాం..
అయితే ఇదే వ్యాఖ్యలపై తాజాగా పవన్ కళ్యాణ్ స్టాలిన్‌ను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేయడంతో పాటు పరోక్షంగా సీఎం స్టాలిన్‌కు వార్నింగ్ ఇచ్చారు. పవన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరని, సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టాలనుకున్న వారే తుడిచిపెట్టకుపోతారని తిరుపతి బాలాజీ సాక్షిగా ఈ మాట చెబుతున్నా అంటూ పవన్ కళ్యా్ణ్ తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో హెచ్చరించారు. ఇతర మతాలపై ఆ తరహా వ్యాఖ్యలు ఆయన చేసి ఉంటే ఈపాటికి దేశం తగలబడి పోయి ఉండేదని పవన్ అన్నారు. పవన్ వారాహి డిక్లరేషన్ సభలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా మాట్లాడారు. కానీ, హిందువులు మాత్రం మౌనంగా ఉండాలా అని ప్రశ్నించారు. దీంతో పవన్ వ్యాఖ్యలపై అటు తమిళనాడు డీఎంకే నేతలకు.. ఇటు జనసేన నేతలకు సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. మరోవైపు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీ స్పందన ఏమిటి..? అని మీడియా ప్రతినిధులు ఉదయనిధి స్టాలిన్‌ను ప్రశ్నించగా.. ఆయన ఏక వాక్యంలో ముక్తసరిగా ‘ఏం జరుగుతుందో చూద్దాం’ అంటూ దాటవేశారు.
Read Also:Bigg Boss 8 Telugu: వైల్ కార్డ్ ఎంట్రీస్ లేకుండా ఆఖరి రోజు అంటూ.. కంటెస్టెంట్లను ఆటాడేసుకున్నాడుగా