మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు.. ఒకవైపు చేతి నిండా సినిమాలు ఉన్నా మరోవైపు కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ కొత్త సినిమాలను లైనప్ లో పెడుతున్నాడు.. తాజాగా నిన్న ఉగాది సందర్బంగా కొత్త సినిమాను ప్రకటించాడు.. ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో రవితేజ ఈ సినిమాను ఒకే చేశాడు.. అయితే గతంలో వచ్చిన మాస్ యాక్షన్ జోనర్ కాకుండా మళ్లీ తన మార్క్ కామెడిని ఈ సినిమా చూపించబోతున్నారని తెలుస్తుంది.. ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..
రవన్న ఈ సారి మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాతో రాబోతున్నాడు. ఈ క్రమంలో రవితేజ కు సామజవరగమన కథా రచయిత భాను బోగవరపు చెప్పిన కథ కు ఓకే చెప్పేసాడు.. వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతున్నట్లు అఫిషియల్ ప్రకటన వచ్చేసింది.. ఈ సినిమాలో రవితేజ పాత్ర గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమాలో రవితేజ పాత్ర పేరు లక్ష్మణ్ భేరి అని పోస్టర్ లో పేర్కొన్నారు. అలాగే ఆ పేరు కింద ఉగాది నాడు రాసి ఫలాల డీటెయిల్స్ ఇవ్వగా, అందులో ఆదాయం చెప్పన్ అని, వ్యయం లెక్క చెయ్యన్ అని, అవమానం జీరో అని, రాజపూజ్యం అన్లిమిటెడ్ అని ఉంది..
అంటే ఈ సినిమాలో నిరుద్యోగిగా కనిపించబోతున్నారని తెలుస్తుంది.. వెంకీ సినిమాలోలాగా ఈ సినిమాలో కనిపించునున్నారని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే వరకు వెయిట్ చెయ్యాల్సిందే.. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మాణం లో ఈ సినిమా తెరకెక్కనుండగా, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు.. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతుందని ప్రకటించారు..