Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్ సిద్ధాంతి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్ నుండి బెంగళూరు వైపు వెళుతున్న మహారాష్ట్రకు చెందిన కంటైనర్.. హైదరాబాద్ నుండి ఎయిర్పోర్ట్ కి వెళ్తున్న కారును ఢీ కొట్టింది. అదే వేగంతో రైట్ సైడ్ లోని రాంగ్ రూట్లోకి దూసుకెళ్లిన కంటైనర్ ఎదురుగా వచ్చిన ఇసుక లారీ కంటైనర్ లోకి దూసుకెళ్లింది. సిద్ధాంతి వద్దకు రాగానే అతివేగం నిర్లక్ష్యం కారణంగా కారును ఢీ కొట్టింది. అనంతరం రహదారిలోని ఇసుక లారికి ఢీకొన్న కంటైనర్ లోకి ఇసుక లారీ దూసుకెళ్లింది. అయితే.. పూర్తిగా వాహనాలు ధ్వంసమయ్యాయి.
Read also: TS Group-1 Exam: బిగ్ బ్రేకింగ్.. తెలంగాణ గ్రూప్-1 పరీక్ష మళ్లీ రద్దు..
ప్రమాదంలో గాయాలతో రెండు వాహనాల డ్రైవర్లు చాకచక్యంగా బయటపడ్డారు. స్థానిక సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి పంపారు. కాస్త బలంగా ఢీకొన్నట్టైతే కల్వర్టులోకి కంటైనర్ దూసుకెళ్లే ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. వాహనాల డ్రైవర్లు వివరాలపై ఆరా తీస్తున్నారు. డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారా? అనేకోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం శంషాబాద్ నుండి హైదరాబాద్ వెళ్లే రహదారిపై జరగడంతో.. భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఈ మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న ఎయిర్పోర్ట్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో పడ్డారు. ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు.
Navdeep In Drugs Case: విచారణకు హీరో నవదీప్.. పెద్ద తలకాయల్లో కొత్త టెన్షన్..!