Rapido Rider: బెంగళూరులో ర్యాపిడో డ్రైవర్లకు సంబంధించిన నేరాలు ఈ మధ్యకాలంలో ఎక్కువతున్నాయి. గతంలో ర్యాపిడో ట్యాక్సీ డ్రైవర్, తన స్నేహితుడితో కలిసి యువతిపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం మర్చిపోకముందే, తాజాగా ర్యాపిడో స్కూటర్ రైడర్ ప్రయాణికురాలు పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన విషయంలోకి వెళితే..
Read Also: Vellampalli Srinivas: ఎంత మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇచ్చారు..?
జూన్ 14న బెంగళూరులోని జయనగర్ ప్రాంతంలో ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల ర్యాపిడో రైడర్ దురుసుగా ప్రవర్తించాడు. ఆమె బుక్ చేసిన రైడ్ సమయంలో అతడు అతి వేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తుండటంతో మహిళ నెమ్మదిగా వెళ్లాలని సూచించింది. కానీ, ఆమె మాట పక్కన పెట్టి ఆమెతో వాగ్వాదం చేసాడు. ఈ వాగ్వాదం చివరికి పెద్దగా మారి, ర్యాపిడో రైడర్ నడిరోడ్డుపై ఆమెకు చెంపదెబ్బ కొట్టేంతవరకు వెళ్లింది. అలా అతనయు కొట్టడంతో ప్రయాణికురాలు ఆమె నడిరోడ్డుపై కిందపడిపోవాల్సి వచ్చింది. ఈ ఘటనను అక్కడున్న వారు ఆపకుండా కళ్లప్పగించి చూసారు కానీ ఎంటువంటి రియాక్షన్ ఇవ్వకపోవడం విడ్డురం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Read Also: CM Revanth Reddy: కేసీఆర్ దొరికిన చోటల్లా అప్పు చేసిండు..
ఇక ఈ ఘటన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రైడర్‌ను గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజెన్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రైడర్‌ను విమర్శిస్తూ, అతనిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.
BENGALURU: Rapido bike rider slaps customer as she allegedly questions him over rash driving and jumping signal. Incident occurred on June 14th in Jayanagar area of Bengaluru.
Jayanagar police are looking into the case.
INPUT: @Harishup pic.twitter.com/j8IbpvItT0— Rahul Shivshankar (@RShivshankar) June 16, 2025