Shaktiman : బుల్లితెరలో అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ హీరో సీరియల్ ‘శక్తిమాన్’. ముఖేష్ ఖన్నా శక్తిమాన్ గా నటించిన ఈ సీరియల్ దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూపర్ హీరో ఫ్రాంఛైజీల ప్రారంభ దశలోనే శక్తిమాన్ పాత్ర భారతీయ బుల్లితెర ప్రేక్షకుల్లో ఒక సంచలనం. పలుభాషలలో అనువాదమై చిన్నాలను అలరించింది. ఇప్పుడు సోనీ పిక్చర్స్ సంస్థ దీనిని మూడు భాగాల సినిమాగా నిర్మించబోతోంది. ఆ సీరియల్ ను సినిమాగా రూపొందించే హక్కులను సోనీ పిక్చర్స్ సొంతం చేసుకుంది. శక్తిమాన్ పాత్ర అనగానే ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా గుర్తుకు వస్తారు. ఆయన అద్భుత నటన, అభినయం వెంటనే అందరికీ గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం ఆయన వయసు మీద పడింది. దీంతో శక్తిమాన్ పునరాగమనంలో ఆ పాత్రలో నటించే స్టార్ ఎవరన్న చర్చ కొనసాగుతోంది.
Read Also:Komatireddy Venkat Reddy: నాకు పేరు వస్తుందనే కేసీఆర్ నిధులు విడుదల చేయలేదు..
దేశంలోని ప్రముఖ సూపర్ స్టార్స్ లో ఒకరు శక్తిమాన్ గా వెండితెరపై కనిపించబోతున్నారని, ఓ ప్రముఖ దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ విశేషాలను తెలియచేస్తూ, అధికారికంగా ఓ చిన్న వీడియోను సోనీ పిక్చర్స్ సంస్థ విడుదల చేసింది. మాజీ ఫిల్మ్ జర్నలిస్టులు ప్రశాంత్ సింగ్, మాధుర్య వినయ్ తో పాటు ‘శక్తిమాన్’ ఫేమ్ ముఖేష్ ఖన్నా సైతం ఈ ప్రాజెక్ట్ కు సహ నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. నిజానికి శక్తిమాన్ పాత్రలో నటించాలని రణవీర్ సింగ్ కలలు కన్నాడు. అతడు నేరుగా హక్కుదారు అయిన సీనియర్ నటుడు ముఖేష్ ఖన్నాను కలిసి అభ్యర్థించాడు. కానీ శక్తిమాన్ పాత్రలో రణవీర్ సింగ్ సరిపోడని అతడు భావించారు. రణవీర్ ప్రవర్తన అంతగా సూట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగానే… `యానిమల్` చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న రణబీర్ తో ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లాలని అతడి అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఒకవేళ రణవీర్ స్థానంలో రణబీర్ కపూర్ ఈ పాత్రలో నటించేందుకు ఆసక్తి కనబరిచి.. అతడు నేరుగా ముఖేష్ జీని కలిసి అనుమతి కోరితే బావుంటుందని కూడా వారు సూచిస్తున్నారు. కానీ ఫైనల్ గా హీరో ఎవరు? అనే సస్పెన్స్ వీడలేదు. ఇది అంత సులువుగా జరిగేదిగా కూడా కనిపించడం లేదని విశ్లేషిస్తున్నారు. ఈ చిత్రం రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని, అంత పెద్ద మార్కెట్ ని కొల్లగొట్టే సత్తా ఉన్న స్టార్ ని ఎంపిక చేయాలని కూడా చిత్రబృందం భావిస్తోందట. ఇప్పటివరకూ శక్తిమాన్ గా ఎవరూ ఎంపిక కాలేదు. ఇంతకీ శక్తిమాన్ ఎవరవుతారో చూడాలి.